వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘బాహుబలి 2 ’ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం 500 టికెట్లు బుక్ చేసిన కలెక్టర్

బాహుబలి 2 సినిమా చూసేందుకు చివరికి ఐఏఎస్‌‌లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మొత్తం 500 టికెట్లు కొనుగోలు చేయడం హాట్ టాపిక

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఇదే ప్రశ్న. ఈ విషయం తెలుసుకునేందుకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు.. సగటు అభిమాని నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ నిరీక్షిస్తున్నారు.

బాహుబలి-2 విడుదల దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాలకు సినీ ఫీవర్ పట్టుకుంది. ఓ వైపు టికెట్ల వేట మొదలైంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానులు ఎంతో అత్రుతగా నిరీక్షిస్తున్నారు. టికెట్ ధర ఎంతయినా ఫర్లేదు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అని ఫిక్సయ్యారు.

బాహుబలి 2 సినిమా ప్రభావం ఎంతలా ఉందంటే.. చివరికి ఐఏఎస్‌‌లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈనెల 28న హన్మకొండలోని ఏషియన్ శ్రీదేవి థియేటర్లో ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్నారు.

Warangal Collector Amrapali booked 500 tickets to watch Bahubali 2 on first day first show

ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మొత్తం 500 టికెట్లు ఆమె కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ షోకు ఎవరికి ఆహ్వానం దక్కుతుందా? అని పలువురు ఎదురుచూస్తున్నారు. ఈ యంగ్ కలెక్టర్‌‌ ఈ షోకి అధికారులను కూడా ఆహ్వానిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

స్థానిక నాయకులకు తన స్నేహితులతోపాటు కలెక్టరేట్ అధికారుల కుటుంబాలకు ఆమ్రపాలి ఈ స్పెషల్ షోకు ఆహ్వానం పంపనున్నారని తెలుస్తోంది. ఓ కలెక్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఇంతలా ఆసక్తి చూపుతుంటే సగటు అభిమాని పరిస్థితి ఏంటి? అని అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

English summary
Hyderabad: Not only the common people, the people of all sectors are eagarly waiting to watch Bahubali 2 movie. Warangal collector Amrapali booked 500 tickets for Bahubali 2 for first day first show. This shows the impact of the release of bahubali 2 movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X