వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్లోనే దెయ్యం, ఆ భయంతోనే సాహసం చేయలేదు: కలెక్టర్ ఆమ్రపాలి

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలికి దెయ్యాలంటే చాలా భయమట. ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడం గమనార్హం. అంతేగాక, దెయ్యం గురించిన సంచలన విషయాలను ఆమె వెల్లడించారు.

నివాసం ఉంటున్న ఇంట్లోనే..

నివాసం ఉంటున్న ఇంట్లోనే..

దెయ్యం తను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉందని ఆమ్రపాలి ఒక టీవీ ఛానెల్‌తో చెప్పారు. ఆగస్టు 10న వరంగల్‌ కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు నిండింది. ఈ సందర్భంగా తాను నివాసం ఉంటున్న చారిత్రక భవనం గురించి ఆమ్రపాలి ఓ టీవీ ఛానెల్‌కు సంచలన విషయాలు పంచుకున్నారు.

ఆసక్తిగా శోధించా..

ఆసక్తిగా శోధించా..

‘జార్జ్‌ పామర్‌ అనే ఆయన భార్య వరంగల్‌ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని తెలిసింది. జార్జ్‌ పామర్‌ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తితో కొన్ని నెలలుగా శోధించా' అని ఆమ్రపాలి తెలిపారు.

 దెయ్యం ఉందని చెప్పారు..

దెయ్యం ఉందని చెప్పారు..

‘నిజాం కాలంలో ఆయనో గొప్ప ఇంజినీర్‌ అని తెలిసింది. ఆమె భార్య కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు ఈ భవనం మొదటి అంతస్తులో దెయ్యం ఉందని నాతో చెప్పారు' అని ఆమ్రపాలి వివరించారు.

 భయంతో సాహసించలేదు

భయంతో సాహసించలేదు

‘అయితే నేను బాధ్యతలు తీసుకున్నాక పైకి వెళ్లి చూస్తే గదంతా చిందరవందరగా పడి ఉండటంతో దాన్ని సర్ది పెట్టించాను. అయినా కూడా ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతో అక్కడ పడుకోవడానికి సాహసించలేను' అని ఆమ్రపాలి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
Warangal Collector Amrapali kata said that she is afraid of Ghosts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X