గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వచ్ఛ భారత్: తెలుగు రాష్ట్రాల్లో ఓరుగల్లు టాప్, బాలకృష్ణ హిందూపురం 457

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్‌లో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా జనాభా ఉన్న 476 పట్టణాలు, నగరాలలో వ్యర్థాల తరలింపు ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ర్యాంకులను కేటాయించింది.

ఇందులో మొదటి వంద స్థానాల్లో తెలంగాణ, ఏపీలకు చెందిన ఐదు నగరాలు ఉన్నాయి. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు నగరాలు టాప్ 100లో చోటు నిలిచాయి. ఏపీ, తెలంగాణల్లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్.. దేశవ్యాప్తంగా 33వ స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ 82వ స్థానంలో, ఏపీలోని విజయనగరం 58వ స్థానంలో, నర్సారావుపేట 59వ స్థానంలో, గుంటూరు 70వ స్థానంలో నిలిచాయి.

Warangal is at 33 position on Swachh Bharat list

తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం 142, మిర్యాలగూడ 169, సికింద్రాబాద్ 191, మహబూబ్ నగర్ 230, కరీంనగర్ 259, గ్రేటర్ హైదరాబాద్ 275, సూర్యాపేట 283, ఖమ్మం 308, అధిలాబాద్ 349 స్థానాల్లో నిలిచాయి. బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం 457వ స్థానంలో నిలిచింది.

స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో మైసూరు టాప్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీ కంటోన్మెంట్ 15వ స్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి స్వచ్ఛ భారత్ జాబితాలో ఆకట్టుకోలేకపోయింది. 476 నగరాల్లో 418వ స్థానంలో వారణాసి నిలిచింది.

స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో 30 నగరాలను, తెలంగాణలో 11 నగరాలను తీసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, క్లీనింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ.. తదితర ఎన్నో అంశాల ఆధారంగా స్వచ్ఛ భారత్ నగరాల జాబితాను శనివారం నాడు ప్రకటించారు.

తెలంగాణ, ఏపీల్లో నగరాల ర్యాంకులు... వరంగల్ 33, నిజామాబాద్ 82, రామగుండం 142, మిర్యాలగూడ 169, సికింద్రాబాద్ 191, మహబూబ్ నగర్ 230, కరీంనగర్ 259, గ్రేటర్ హైదరాబాద్ 275, సూర్యాపేట 283, ఖమ్మం 308 అదిలాబాద్ 349.

విజయనగరం 58, నరసారావుపేట 59, గుంటూరు 70, తిరుపతి 137, ఆదోని 148, నెల్లూరు 156, శ్రీకాకుళం 157, తెనాలి 166, అనంత 181, చిలకలూరిపేట 187, ప్రొద్దుటూరు 198, మదనపల్లి 200, విశాఖ 205, కడప 211, ధర్మవరం 224, రాజమండ్రి 228, తాడిపత్రి 239, ఏలూరు 249, విజయవాడ 266, కాకినాడ 300, మచిలీపట్నం 301, గుంతకల్లు 322, కర్నూలు 330, భీమవరం 342, తాడేపల్లిగూడెం
352, నంద్యాల 354, ఒంగోలు 357, చిత్తూరు 367, గుడివాడ 450, హిందూపురం 457.

English summary
No town in the Telugu states figures in the top 25 cleanest places in the country, according to the Swachh Bharat rankings announced by the Centre on Saturday. Only Warangal featured in the top 50.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X