వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్ ఉప ఎన్నిక - టిఆర్ఎస్ ఎమ్మెల్సీని అడ్డుకున్న ఎస్సై, ఈవీఎం మార్చినా ఓటు పోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ లోకసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది. వరంగల్ లోకసభ నియోజకవర్గంలో 15,09,671 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు.

Warangal

- వర్ధన్ననపేటలో ఓ పోలింగ్‌ కేంద్రంలోకి అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ వచ్చారు. ఇది వివాదాస్పదమైంది. తనకు ఓటు వేయాలని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను సర్వే కోరారు.

- మధ్యాహ్నం మూడు గంటల వరకు 57 శాతం పోలింగ్ నమోదయింది. స్టేషన్ ఘనపూర్‌లో 59 శాతం, వరంగల్ వెస్ట్‌లో 39 శాతం, వరంగల్ ఈస్ట్‌లో 55 శాతం, పరకాలలో 61 శాతం, వర్ధన్నపేటలో 61 శాతం, భూపాలపల్లి 58.4 శాతం పోలింగ్ నమోదయింది.

- ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని భన్వర్ లాల్ చెప్పారు. ఇప్పటి వరకు ఎవరి నుంచి ఒక్క ఫిర్యాదు అందలేదన్నారు. ఈవిఎం మొరాయించి, మరో ఈవిఎం మార్చినా వేసిన ఓటు ఎక్కడకు వెళ్లదని చెప్పారు. నిక్షిప్తమై ఉంటుందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. కలెక్టర్ హామీతో పోలింగ్‌ను బహిష్కరించిన తండావాసులు ఓటు వేయనున్నారని చెప్పారు.

- మధ్యాహ్నం ఒకటి గంటల వరకు 44 శాతం పోలింగ్ నమోదు. వర్ధన్నపేటలో 51 శాతం, భూపాలపల్లిలో 52 శాతం, పాలకుర్తిలో 44.4శాతం, పరకాలలో 53 శాతం, స్టేషన్ ఘనపూర్‌లో 39.5 శాతం, వరంగల్ ఈస్ట్‌లో 38.5, వరంగల్ వెస్ట్‌లో శాతం 29.2 నమోదయింది.

- భూపాలపల్లిలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- మధ్యాహ్నం 1 గంటల వరకు 46 శాతం పోలింగ్ నమోదయింది.
- వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుందని భన్వర్ లాల్ చెప్పారు. ఈవిఎంలు మార్చినా ... వేసిన ఓటు ఎక్కడికి పోదన్నారు.

- హిజ్రాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్‌ కరీంబాగ్‌లో రెండు వందల మందికి పైగా హిజ్రాలు ఓటు వేశారు.

- 12 గంటల వరకు 40 శాతం పోలింగ్ జరిగిందని భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్ బహిష్కరించిన టిక్యా తండావాసులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

- మొరాయించిన చోట్ల ఈవిఎంలను పునరుద్ధరించామని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు.

పదకొండు గంటల వరకు వర్దన్నపేట నియోజకవర్గంలో 34 శాతం, భూపాలపల్లి నియోజకవర్గంలో29.3 శాతం, పాలకుర్తి నియోజకవర్గంలో 28.5 శాతం, పరకాల నియోజకవర్గంలో 30 శాతం, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 28.2 శాతం, వరంగల్ ఈస్ట్‌లో 21.5 శాతం, వరంగల్ వెస్ట్‌లో 22.5 శాతం నమోదయింది.

పదకొండు గంటల వరకు వర్దన్నపేట నియోజకవర్గంలో 34 శాతం, భూపాలపల్లి నియోజకవర్గంలో29.3 శాతం, పాలకుర్తి నియోజకవర్గంలో 28.5 శాతం, పరకాల నియోజకవర్గంలో 30 శాతం, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 28.2 శాతం నమోదయింది.

- మధ్యాహ్నం పదకొండు గంటల వరకు 27.69 శాతం పోలింగ్ నమోదయింది.
- నర్సక్కపల్లిలో సభాపతి మధుసూదనాచారి ఓటేశారు.

- రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ దంపతులు కొడకండ్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారు టీక్యా తండా వాసులు వరంగల్‌ పార్లమెంట్‌ ఉపఎన్నిక పోలింగ్‌ను బహిష్కరించారు. తండాకు వీధి దీపాలు, రోడ్లు, మురుగుకాలువలు సక్రమంగా లేవని, తమను పట్టించుకోవడంలేదని, గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆ తర్వాత విస్మరిస్తున్నారని తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ హామీ ఇస్తేనే పోలింగ్‌లో పాల్గొంటామని తేల్చి చెప్పారు.
- మొత్తం 1,778 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉండటంతో 2 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ముఖచిత్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉప ఎన్నికల్లోనూ నోటాకు అవకాశం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మొదటి ఓటరుకు అధికారులు పువ్వు అందజేశారు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది.
- పట్టణాలలోకంటే పల్లెల్లోని ఓటర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

- వరంగల్‌ లోకసభ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 9గంటలకు 8.85 శాతం పోలింగ్‌ నమోదైంది.

- ధర్మసాగర్‌లో ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని స్థానిక ఎస్సై అడ్డుకున్నారు. రాజేశ్వర్ రెడ్డి వద్ద ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు లేకపోడంతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడానికి వీల్లేదని చేశారు. దీంతో రాజేశ్వర్‌రెడ్డి వెనుదిరిగారు.

- టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయకర్ వరంగల్‌లోని బొల్లికుంటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ వినోద్ ఓటేశారు.
- తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు పర్వతగిరిలోఓటు హక్కును వినియోగించుకున్నారు.
- పాలకుర్తి మండలం తీగారంలో ఈవిఎం మొరాయించింది. దాదాపు 20 నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 102 పోలింగ్ బూత్‌లో ఈవిఎం మెరాయించడంతో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
- హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొవ్వొత్తుల వెలుగులో పోలింగ్‌ కొనసాగింది.
- భూపాలపల్లి పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవిఎం మొరాయించింది. దీంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. తొర్రూరు మండలం వెలికట్టె పంచాయతీ పరిధిలోని ఓ తండాలో గిరిజనులు పోలింగ్‌ను బహిష్కరించారు.
- వరంగల్ నగరంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన తొలి ఓటరుకు కలెక్టర్ అరుణ పూలబొకేతో స్వాగతం పలికారు.

English summary
About 44 per cent polling was reported till noon in the by election to Warangal (SC) Lok Sabha constituency in Telangana today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X