వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్రాపాలి సాహసం: పాండవుల గుట్టపైకి కలెక్టర్, ప్రశంసలు

వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తున్నారు. రాక్ క్లైంబింగ్‌ వేడుకల్లో భాగంగా పాండవుల గుట్టను అధిరోహించారు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వరంగల్ అర్బన్: వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తున్నారు. రాక్ క్లైంబింగ్‌ వేడుకల్లో భాగంగా పాండవుల గుట్టను అధిరోహించారు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రాపాలి.

రాక్‌ క్లైంబింగ్‌ ఉత్సవాల్లో అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి పాల్గొన్నారు. ఆదివారం జయశంకర్‌ జిల్లా రేగొండ మండలంలోని పాండవులగుట్టల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండురోజుల నుంచి నిర్వహిస్తున్న రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టివల్‌లో అమ్రపాలి పాల్గొన్నారు.

 Warangal Urban Collector Amrapali takes to rock climbing

అర్బన్‌ జిల్లా అటవీశాఖ అధికారి అర్పనతో కలిసి పాండవుల గుట్టలపైకి చేరుకున్నారు. రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టివల్‌లో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు కేయూ,నిట్‌ విద్యార్థులు, హైదరాబాద్‌కు చెందిన 150మంది విద్యార్థులు రాక్‌ క్లైంబింగ్‌ విన్యాసాలను నిర్వహించారు.

విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాండవుల గుట్టలకు చేరుకోగా, కలెక్టర్‌ అమ్రపాలి సైతం యువతతో కలిసి రాక్‌ క్లైంబింగ్‌లో పాల్గొని పాండవుల గుట్టల పైకి ఎక్కడంతో పలువురు అభినందించారు.

కలెక్టర్‌ ధైర్యసాహసాలను అభినందిస్తూ సోషల్‌మీడియాలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం అడవుల్లో రెండు గంటలపాటు నడి చి చెరువును, ఇనుప ఖనిజం గుట్టలను సందర్శించారు అమ్రాపాలి.

మరోసారి పాండవుల గుట్టల్లోని రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టివల్‌లో పాల్గొని ఉమ్మడి జిల్లా వాసులను ఆకర్షించారు. కాగా, రెండు రోజులుగా జరుగుతున్న రాక్‌ క్లైంబింగ్‌ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆగస్టు 20న హైదరాబాద్‌లో జరిగిన ఎయిర్‌టెల్‌ మారథాన్‌లో 21 కిలోమీటర్లు నడిచి అందరి దృష్టిని ఆకర్శించారు. ఒక వైపు అధికారిక విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సాహసాలు చేయడం ద్వారా కలెక్టర్‌ అమ్రపాలి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

English summary
A young and energetic officer Amrapali Kata, who is the district Collector of Warangal Urban, has been hogging the limelight for one or other reason of late.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X