వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 లో చంద్రబాబు ఈవీఎంల తో జరిగిన ఎన్నికల్లో గెలవలేదా : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

ఏపి సీఎం చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఈవిఎంలతో నే గెలిచాడా లేదా అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించాడు,చంద్రబాబు ఇప్పటికైన చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికాడు. టీడీపీ కార్యకర్తలే ఆయన పని అయిపోందని అంటున్నారని ఆయన చెప్పారు.

చంద్రబాబు పని అయిపోయింది,

చంద్రబాబు పని అయిపోయింది,


చంద్రబాబు పని అయిపోందని వాళ్ల కార్యకర్తలే అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగా ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది అసాధ్యమని చెప్పారు. ట్యాంపరింగ్ జరిగితే ప్రజలు తిరగబడతారని తెలిపారు . కాగా 2014 లో చంద్రబాబు ఈవిఎంలతో జరిగిన ఎన్నికల్లో గెలవలేదా అంటూ ప్రశ్నించారు. రానున్న ఫలితాల్లో చంద్రబాబు దారి తప్పి గెలిస్తే ఈవీఎంల తీరుపై ఏం మాట్లాడతారని అన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు ఇకనైన మానుకోవాలని ఆయన హితవు పలికారు. టెక్నాలజీ తనవల్లే వచ్చందని చెప్పే చెంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

ఈసీ అధికారులను బదీలీ చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం

ఈసీ అధికారులను బదీలీ చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం

ఏపిలో అధికారులను ఈసీ బదీలి చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని అన్నారు .తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వర్ రావు ఏం చేశారో అందరికి తెలుసని అన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ లో జాహ్నావి అనే పేరుతో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కథనాలు రాశారని తెలిపారు.అలాంటీ అధికారులను బదీలీ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. కాగా రెవెన్యూలో మెజారీటి ఉద్యోగులు మంచివారేనని కొద్దిమంది వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
చంద్రబాబు ఓటర్లకు వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పనైపోయిందని అర్థమైందని చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడ దక్కవు

కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడ దక్కవు


తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లు కూడ దక్కవని ఆయన జోస్యం చెప్పారు. మరో అయిదు స్థానాల్లో మూడవ స్థానంలో ఉంటుంందని తెలిపారు.అయితే కాంగ్రెస్ పార్టీకి దిక్కులేకే బీజేపీకి ఓట్లు వేయించారని అన్నారు. తెలంగాణ సమాజం బీజేపీనీ ఆదరిస్తారని అనుకోవడం లేదని తెలిపారు. కాగా ఒకటి రెండు పథకాలతో ఓట్లు పడవని ఆయన అన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తి చెందితేనే ఓట్లు వేస్తారని చెప్పారు. కాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల తీరు టీఆర్ఎస్ పాలను అద్దం పడుతోందని , ఏపిలో జరిగిన తీరు వాళ్ల పాలనకు అద్దంపడుతోందని చెప్పారు.

English summary
TRS working president KTR said that the TDP activist also feel that Chandrababu chapter was closed. and he asserted EVMs tampering is impossible , If the EVM'S tampering happens, people will be reversed.he questioned Chandrababu had not won with EVMs In 2014 the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X