హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్: రైలు కిందపడుతున్న మహిళను కాపాడిన పోలీసు(వీడియో)

|
Google Oneindia TeluguNews
Watch: RPF staff saves woman passengers life at Secunderabad Railway station

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసు అప్రమత్తతతో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి తప్పించుంకుది. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు ఆమె రైలు కిందపడిపోతున్న సమయంలో.. అక్కడేవున్న రైల్వే పోలీసు క్షణాల్లో స్పందించి ఆమెను కాపాడాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాధిత ధన్‌పూర్ వెళ్లే రైలు ఎక్కుతుండగా.. అది ఒక్కసారిగా కదలడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ఫ్లాట్ ఫాం వెళుతున్న ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ సైఫుద్దీన్ ప్రమాదాన్ని గమనించి ఆమెను కాపాడాడు. వేగంగా స్పందించిన ఆయన.. ఆమెను ఫ్లాట్‌ఫాంపైకి లాగేశారు. ఈ క్రమంలో ఆయన కూడా అదుపుతప్పి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న మరికొంత మంది ప్రయాణికులు కూడా వెంటనే స్పందించి సాయం చేశారు.

డిసెంబర్ 18న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ సదరు మహిళ రైలు ఎక్కే ప్రయత్నం చేసిన కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మహిళను కాపాడిన రైల్వే పోలీసుపై అక్కడున్నవారు, వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు మహిళపై మండిపడుతున్నారు.

English summary
Watch: RPF staff saves woman passenger's life at Secunderabad Railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X