• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి: కేంద్రానికి ఏపీ ఫిర్యాదు, టీ రివర్స్

|

హైదరాబాద్‌: తెలంగాణ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై మరోసారి ఆంధ్రప్రదేశ్‌.. కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మళ్లీ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి చర్చించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి.. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. జలవనరుల మంత్రిత్వ శాఖ కూడా ఈ లేఖను బోర్డుకు పంపింది.

గత సంవత్సరం కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల గురించి వివరంగా చర్చ జరిగిందని తెలిపింది. అయితే, రెండు రాష్ట్రాలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయని, మళ్లీ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకొంటామని చెప్పినా ఇప్పటివరకు జరగలేదని వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై ఉన్న పాలేరు రిజర్వాయర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని మళ్లించేలా భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించి పరిష్కరించాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోందని ఆరోపించింది.

Water row: Telangana wants its share from Pattiseema

తుంగభద్ర నదిపైన సుంకేశుల నుంచి 5.44 టీఎంసీల నీటిని మళ్లించి 55,600 ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందని తమ ఫిర్యాదులో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ ఈ ప్రాజెక్టులను చేపట్టకుండా చూడాలని కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతల, తుమ్మిడిహట్టి, సీతారామ ఎత్తిపోతల, తుపాకులగూడెం, పెన్‌గంగపై చేపట్టిన బ్యారేజీలు, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను తెలంగాణ కొత్తగా చేపట్టిందని ఆంధ్రప్రదేశ్‌ చెప్పింది. కాగా, ఇప్పటికే పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులు కొత్తవని.. బోర్డు దృష్టికి తెచ్చింది

తెలంగాణ. కొత్తగా నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నీటిలో తమకు కూడా వాటా ఉందని పేర్కొంది. ఛైర్మన్‌ సాహు, సభ్యకార్యదర్శి సమీర్‌ఛటర్జీ, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు సభ్యులుగా ఉన్న గోదావరి బోర్డు వీటిపై చర్చించాల్సి ఉంది.

కాగా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరగనుంది. సుమారు 15 అంశాలను అజెండాలో చేర్చారు. అయితే బోర్డు నిర్వహణకు సంబంధించిన మాన్యువల్‌, భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేపట్టి బోర్డు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లపై చర్చ.. ప్రధాన అంశాలని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Krishna water sharing dispute between Telangana and AP is back to square one with the former demanding a meeting to be convened by the Union water resources ministry to decide on allocation. Telangana on Thursday dashed off a letter to the ministry seeking a share in the Pattiseema waters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more