వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నాకు భయం లేదు, అనుమతిస్తేనే బ్లడ్‌శాంపిల్స్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకే విచారణ'

డ్రగ్స్ కేసు విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నామని , ఎక్కడ కూడ ఈ నిబంధనలను ఉల్లంఘించలేదని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నామని , ఎక్కడ కూడ ఈ నిబంధనలను ఉల్లంఘించలేదని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు.

డ్రగ్‌ కేసు: నేడు సిట్ అధికారుల ముందుకు నవదీప్, ప్రత్యేక ప్రశ్నావళి?డ్రగ్‌ కేసు: నేడు సిట్ అధికారుల ముందుకు నవదీప్, ప్రత్యేక ప్రశ్నావళి?

డ్రగ్స్ కేసు విషయంలో విచారణలు కొనసాగుతున్నాయి. సోమవారంనాడు సినీ నటుడు నవదీప్ హజరయ్యారు. అయితే సోమవారం నాడు సినీ నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. తాను సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను పాటించాలని ఆమె కోర్టును కోరింది.

డ్రగ్ కేసు:గదులను మారుస్తూ విచారణ ఇలా, కొంపముంచిన కెల్విన్డ్రగ్ కేసు:గదులను మారుస్తూ విచారణ ఇలా, కొంపముంచిన కెల్విన్

అయితే మంగళవారం నాడు కోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తోందోననే ఉత్కంఠ సర్వాత్రా నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకే చార్మిని విచారణ చేసే విషయంపై సిట్ అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ కేసు విచారణను ఈ ఏడాది ఆగష్టు రెండవ తేదివరకు కొనసాగుతోంది. అయితే స్కూల్ పిల్లల పేర్లను తాము ఎట్టిపరిస్థితుల్లో వెల్లడించబోమని ఎక్సైజ్ శాఖాధికారులు ప్రకటించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను ఏనాడూ ఉల్లంఘించలేదు

సుప్రీంకోర్టు ఆదేశాలను ఏనాడూ ఉల్లంఘించలేదు

సినీ నటి ఛార్మి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ విషయమై అకున్ సబర్వాల్ స్పందించారు. ఏనాడూ కూడ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను తప్పలేదని అకున్ సబర్వాల్ ప్రకటించారు. విచారణ సందర్భంగా నలుగురు అధికారులు ఉంటున్నారని చెప్పారు.అంతేకాదు ఈ టీమ్‌లో ఓ మహిళ అధికారి కూడ ఉన్నారని ఆయన చెప్పారు. అయితే ఇద్దరు నటీమణులకు ఇచ్చిన నోటీసులలో ఎక్కడ కోరుకొంటే అక్కడే విచారణ చేస్తామని నోటీసులో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. తప్పుడు పద్దతులను విచారణ సందర్భంగా అనుసరించలేదని ఆయన చెప్పారు. పరోక్షంగా ఆయన ఛార్మి కోర్టును ఆశ్రయించిన విషయమై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అనుమతితోనే బ్లడ్‌శాంపిల్స్

అనుమతితోనే బ్లడ్‌శాంపిల్స్

విచారణకు హజరైనవారి అనుమతితోనే బ్లడ్‌శాంపిళ్ళతో పాటు గోళ్ళు, వెంట్రుకల శాంపిళ్ళను తీసుకొంటున్నామని అకున్ సబర్వాల్ చెప్పారు. అయితే విచారణ సమయంలోనే వారి నుండి రాతపూర్వకంగా అనుమతి తీసుకొన్న తర్వాతే ఈ శాంపిళ్ళను తీసుకొంటున్నట్టు చెప్పారు. ఒకవేళ ఈ అనుమతి ఇవ్వకపోతే ఈ విషయాన్ని కేసు డైరీలో రాస్తామన్నారు. ఒకవేళ కోర్టు ఏ రకంగా ఆదేశాలు జారీ చేస్తే దాన్ని పాటిస్తామన్నారు. బ్లడ్‌శాంపిల్స్ సేకరణను వ్యతిరేకించిన వారి నుండి తీసుకోవడం లేదన్నారాయన.

సీనియర్ అధికారుల సలహలు

సీనియర్ అధికారుల సలహలు

ఈ కేసు విచారణకు సంబంధించిన సీనియర్ పోలీసు ఉన్నతాధికారుల సలహలను తీసుకొంటున్నట్టు అకున్ చెప్పారు. సినిమా రంగాన్ని టార్గెట్ చేసినట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అంతేకాదు ఈ విషయమై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమకు అన్ని రంగాలు సమానమేనని చెప్పారు. ఇప్పటివరకు 27 మందిని విచారించినట్టు చెప్పారు.అయితే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన 19 మందిలో 6 ముఖ్యమైనవారేనని ఆయన ప్రకటించారు.

నాకు భయం లేదు.

నాకు భయం లేదు.

తనకు ఎలాంటి భయం లేదన్నారు అకున్ సభర్వాల్. తనకున్న ఉన్న ఇద్దరు గన్‌మెన్లు చాలా సుశిక్షితులైనవారని చెప్పారు. వారు ఉన్నంతవరకు తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తన గురించి భయపడాల్సిన అవసరం లేదని సబర్వాల్ ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు గాను ఇద్దరు అధికారులను నియమించినట్టు ఆయన ప్రకటించారు.

English summary
We are following the supreme court guidelines in drug case interrogation said Excise enforcement director Akun sabharwal.He spoke to media on Monday evening at his office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X