వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయదశమికి వీల్లేనట్టే..! తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సెంటిమెంట్ అడ్డంకి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే దీని మీద మీడియా పెద్దగా ప్రతిస్పందించలేదు. అలాంటిది గడిచిన రెండు, మూడు రోజులుగా మాత్రం పరిస్థితుల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది.

ఇప్పుడు మీడియా కేబినెట్ విస్తరణ మీద వార్తలు రాస్తున్నాయి. విస్తరణ జరిగితే ఎవరికి అవకాశాలు లభిస్తాయన్న విషయంపై భారీ ఎత్తున విశ్లేషణలు చేస్తోంది తెలుగు మీడియా. ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ అంశం పై ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుందంటే కారణం లేకపోలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

దీనికి తోడు ఊహించిన రీతిలో మజ్లిస్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ తాజాగా కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని, ఆయన మంత్రిగా మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అసద్ అలా వ్యాఖ్యానించడం వెనక మర్మం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

We are not in a successful phase. Telangana cabinet helps in expansion of sentiment

అసదుద్దీన్ అంతటి వ్యక్తి నోటి నుంచి కేటీఆర్ కు కేబినెట్ లో చోటు ఇవ్వమన్న మాట వచ్చిందంటే, విషయంలో ఏదో మతలబు ఉన్నట్లే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరో ఒకరి సూచనతో తప్ప, అసద్ తనకు తానుగా ఇలాంటి మాటల్ని మాట్లాడటం ఆయనకు అలవాటు లేదనే చెప్పాలి. అలాంటిది అసద్ నోటి నుంచి రావటం తో పాటు, హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో కేటీఆర్ మంత్రి కావాల్సిన అవసరం ఉందన్న ఆవశ్యకతను టీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నోటి నుంచి రావటం గమనార్హం.

ఇప్పటివరకూ దసరా నాటికి కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జరిగినా, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పండక్కి ముందే జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువ. ఏం చేసినా మంచి రోజులు చూసుకోవటంతో పాటు తిధి, నక్షత్రం, వారం, వర్జ్యం లాంటివి చాలానే పరిగణలోకి తీసుకుంటారు. మరో నాలుగైదు రోజుల్లో వినాయకచవితి పండగ. ఆ తర్వాత నెల వరకూ ఏ పని పెట్టుకోరు.

మళ్లీ ఏదైనా ప్రాముఖ్యత సంతరించుకునే పని చేయాలంటే విజయదశమికే.. ఆ లోపు ఏ ముఖ్యమైన పనిని చేపట్టేందుకు రోజులు అనువుగా లేవని శాస్త్రం చెబుతున్నది. చంద్రశేఖర్ రావు కు ఇలాంటి వాటిపై నమ్మకం ఎక్కువ. కాబట్టి దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉండదని సూచాయగా నిర్థారణ జరుగుతోంది.

English summary
Few TRS leaders are demanding that Kalvakuntla Taraka Rama Rao, who is the TRS working President, be taken into the cabinet. In addition to this, the Majlis supremo Asududdin Owaisi has to take the latest ktr into the cabinet and he wants to come back as a minister. There is talk of a mystery behind Asad's comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X