వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ గుడిసెకు నిప్పు పెట్టాం ఏమి అనుకోకండి ,డబ్బులు తీసుకోండి

|
Google Oneindia TeluguNews

అధునిక కాలంలో కూడ ఇంకా మంత్రాల బెడదకు ఫుల్ స్టాప్ పడడం లేదు, మంత్రాలు వస్తాయంటే చాలు గ్రామస్తులు అగ్గిమీద గుగ్గిలం అవుతారు, మంత్రాలు వస్తాయని భావించిన వ్యక్తుల ఏలాంటీ చిత్రహింసలకు గురిచేసినా అడిగే నాధుడే ఉండడు. సంఘటన జరుగుతున్నప్పుడు ప్రజలు నిశ్ఛేష్టులుగా మిగులుతారు తప్ప,దాన్ని అడ్డగించేందుకు ముందుకు రారు. ,ఈ నేపథ్యంలోనే ..మంత్రాల నెపంతో నిలువునా మనుషులను కాల్చి చంపడం, లేదా నడి బజార్లో వివస్త్రను చేసి ఊరేగించడం లాంటీ సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి...

బహిరంగంగా ఇలాంటీ సంఘటనలకు పాల్పడినవారు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటారు,కాని ప్రస్థుతం జరిగిన సంఘటనలో మాత్రం మేమే కాల్చము,డబ్బులు తీసుకోండి అంటూ మరి లేఖ కూడ రాసి పెట్టారు .

అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!అత్యాచార నిందితులు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే!

We burned your hut,pls take money as Compensation

ఈ నేపథ్యంలోనే తాజగా నిర్మల్ జిల్లా ,ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామానికి చెందిన పాదం ఎర్రన్న భార్యకు మంత్రాలు వస్తాయని ,భావించిన గుర్తు తెలియని వ్యక్తులు వారి పశువుల పాకను తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం రాత్రి ఎర్రన్న పశువుల పాక అనుకుని పక్కనే ఉన్న బుచ్చన్న అనే గ్రామస్తుడి పాకను తగుల బెట్టారు.

అనంతరం జరిగిన తప్పును తెలుసుకున్న దుండగులు వెంటనే ముప్పైవేల రూపాయలు అక్కడ పెట్టి ,పేపర్లపై ఎర్నన్న పాక అనుకుని నీ పాక కాల్చాం ,ఎర్రన్న భార్యకు మంత్రాలు వస్తాయి గనుక వారి పాకను తగులబెట్టబోయి నీ పశువుల పాకను పోరపాటున తగులబెట్టాము అని రాశారు. క్షమించి, డబ్బులు తీసుకోగలరు అని పేర్కోన్నారు. కాగా మరుసటి రోజే లేఖలో పేర్కోన్నట్టుగా నే ఎర్రన్న పాకను తగులబెట్టారు. దీంతో గ్రామస్తులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు.కాగా జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
There is not a full stop to the ''mantras'' in the modern age also, still now going on, recently one issue occurred in nirmal district .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X