వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూసి గర్వపడుతున్నా.. కాని ఒక్కటే బాధ.. : కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని 91 లోకసభ నియోజకవర్గాలకు తొలి విడతలో భాగంగా గురువారం పోలింగ్ జరిగింది. తెలంగాణలో ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటలలోపు క్యూలైన్లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత వస్తే మాత్రం ఈ అవకాశం ఉండదు. అయితే ఓటింగ్ శాతం తక్కువగా నమోదయింది.

<strong>ఏమైందో తెలియాలి: ఓటేసిన పవన్ కళ్యాణ్, ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్ట్! ఏం జరిగిందంటే?</strong>ఏమైందో తెలియాలి: ఓటేసిన పవన్ కళ్యాణ్, ఈవీఎం ధ్వంసం.. జనసేన అభ్యర్థి అరెస్ట్! ఏం జరిగిందంటే?

దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. ఇప్పటి వరకు ఎవరైతే ఓటు వేయలేదు, వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలని, అసలు మన ప్రభుత్వం మెజార్టీ వల్ల రాలేదని, ఎక్కువ మంది ఓటు వేయడం వల్ల ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పటికే తెలంగాణలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయింది. దీంతో ఆయన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ట్వీట్ చేశారు.

We do not have government by the majority, We have government by the majority who participate: KTR

తెలంగాణలో లోకసభ ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఈసీ, ప్రభుత్వ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు, ప్రజలపై ఆయన ప్రశంసలు కురిపించారు. కానీ ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమే ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు.

కాగా, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ఈ రోజు జరిగింది. మొత్తం 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోకసభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి తెలంగాణలో 48.95 శాతం పోలింగ్‌ నమోదైంది.

English summary
'Guys, those of you who haven’t yet voted. Please do; remember.“We do not have government by the majority. We have government by the majority who participate.”' KTR tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X