వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలపై సందేహాలు లేవు : పూర్తి సంతృప్తితో ఉన్నామన్న టీఆర్ఎస్ నేత పళ్లా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని .. వీవీప్యాట్లను కూడా లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. అయితే అందుకు అవీ నిరాకరించడంతో మిన్నకుండిపోయాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రం తమకు ఈవీఎంలపై పూర్తి నమ్మకం ఉందని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సందేహాలు లేవు ..
ఈవీఎంలపై అనుమానాలు లేవని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టంచేశారు. ఈవీఎంల పనితీరుపై తమకు ఇసుమింత కూడా సందేహం లేదని తేల్చిచెప్పారు. అయితే గతంలో కొన్ని అనుమానాలు లేవనెత్తామని గుర్తుచేశారు. ఆ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిందని .. వెంటనే అనుమానాలను నివృత్తి చేసిందని పేర్కొన్నారు. అయితే ఈవీఎంలతో జరిగిన కొన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు, ఓడిపోయారు అని పేర్కొన్నారు.

we have no doubt at evms : palla rajeshwar

సంతృప్తితో ఉన్నాం ..
దీంతో ప్రస్తుతం తమకు ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు లేవని స్పష్టంచేశారు. ఈవీఎంలపై పూర్తి సంతృప్తితో ఉన్నామని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. ఈవీఎంల నిక్షిప్తమైన ఓట్లను ప్రజాతీర్పుగా భావిస్తామని పేర్కొన్నారు.

English summary
TRS leader Palla Rajeshwar Reddy said there was no suspicion on EVMs. It is clear that they have no doubt about the performance of EVMs. But in the past, some suspicions have been raised. At that time, the Central Election Commission responded that he had immediately suspended suspicions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X