వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘‘ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలు’’

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యాత్ర పట్ల తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వరంగల్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యాత్ర పట్ల తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెన్ని యాత్రలు చేసినా ప్రజలే న్యాయ నిర్ణేతలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.

హార్డ్‌ వర్కర్, స్మార్ట్‌ సీఎం: కేసీఆర్‌పై మరోసారి పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లుహార్డ్‌ వర్కర్, స్మార్ట్‌ సీఎం: కేసీఆర్‌పై మరోసారి పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు

షాక్‌కి గురయ్యా, తప్పని నాకూ తెలుసు, అస్థిరత కలిగించకూడదనే: ఓటుకు నోటు కేసుపై పవన్ స్పందనషాక్‌కి గురయ్యా, తప్పని నాకూ తెలుసు, అస్థిరత కలిగించకూడదనే: ఓటుకు నోటు కేసుపై పవన్ స్పందన

మంగళవారం నుంచి ప్రజాచైతన్య యాత్రలు చేపడుతున్నామని, ఫిబ్రవరి 9న ఆదిలాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలపై రైతు పోరుయాత్రలు చేపడతామని, దళిత అదాలత్‌లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

bjp-lakshman

అంతేకాదు, సమ్మక్క- సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినట్లు లక్ష్మణ్ చెప్పారు. మేడారం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారబోతోందని, జాతరకు కేంద్ర మంత్రులు, ప్రముఖులు వస్తారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

కానీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. జాతరలో ప్రత్యేక శిబిరాల ద్వారా భక్తులకు సేవలు అందిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.

English summary
"Who ever do what ever Yatras.. People are the final Judges" said Telangana BJP President Lakshman here in Warangal on Monday. He also responded on Janasena Chief Pawan Kalyan's Political Tour. He said BJP has no objection about Pawan's Tour. Lakshman told that they requested Centre to recognize the Sammakka-Saralamma Festival as a National Festival. He also told that Medaram is going to transform into an Spritual Tourism Centre, Ministers and other Prominent Personalities will come to this Sammakka-Saralamma Festival every time. Lakshman critisized State Government that the government is not doing necessary arrangements for this festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X