వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుధాకర్ లేనప్పుడు.. వాళ్లింట్లోనే స్వాతితో: కొత్త కారులోను షికారు.. విచారణలో రాజేష్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నాగర్ కర్నూల్ క్రషర్ వ్యాపారి సుధాకర్ రెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో భర్తనే కడతేర్చిన ఈ ఉదంతం చాలామందిని నివ్వెరపోయేలా చేసింది.

Recommended Video

స్వాతి భర్తను చంపడానికి కారణాలు ! అసహ్యం వేస్తోంది | Oneindia Telugu

ప్రేమించిన భర్తను, కడుపున పుట్టిన పిల్లలను దూరంగా పెట్టి తన సుఖాల కోసం స్వాతి తాపత్రయ పడింది. ఈ క్రమంలో పెడదారి పట్టిన ఆమె.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా.. భర్త స్థానంలో మరొకరిని ప్రవేశపెట్టాలని చూసింది. చివరకు ఎట్టకేలకు నిజం బయటపడటంతో సమాజం ముందు దోషిగా తలవంచుకోక తప్పలేదు.

 సుధాకర్ లేనప్పుడు:

సుధాకర్ లేనప్పుడు:

గురువారం నాగర్ కర్నూల్ పోలీసులు రాజేష్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నుంచి తరలించారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియా ప్రశ్నలకు బదులిచ్చాడు. సుధాకర్‌రెడ్డి లేనప్పుడు వాళ్లింట్లోనే కలుసుకునేవాళ్లమని తెలిపాడు. సుధాకర్ రెడ్డితో స్వాతి వైవాహిక జీవితం సరిగా లేదని, ఆ క్రమంలోనే తాను ఆమెకు దగ్గరయ్యానని చెప్పుకొచ్చాడు.

ఆరోజే కొడుకు పుట్టిన రోజు: అంతా వాట్సాప్!, రాజేష్ ప్రవర్తన ఇలా.. సుధాకర్ హత్యలో మరిన్ని కోణాలుఆరోజే కొడుకు పుట్టిన రోజు: అంతా వాట్సాప్!, రాజేష్ ప్రవర్తన ఇలా.. సుధాకర్ హత్యలో మరిన్ని కోణాలు

 కారులో షికారు:

కారులో షికారు:

భర్తకు తెలియకుండా స్వాతి రాజేష్ తో చాలానే వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. సుధాకర్ రెడ్డి కొత్త కారు కొంటే.. ప్రియుడితో కలిసి స్వాతి అందులో షికారు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రాజేషే చెప్పాడు. కొత్తకారు తెచ్చాం.. రమ్మంటే మహబూబ్‌నగర్‌ కూడా వెళ్లొచ్చామని మీడియా ముందు తెలిపాడు.

 చేతులకు కట్లు:

చేతులకు కట్లు:

రాజేష్‌ ఆరోగ్యంగానే ఉన్నాడంటూ అపోలో డీఆర్‌డీఏ వైద్యులు చెప్పడంతో అతన్ని అరెస్టు చేసేందుకు నాగర్‌కర్నూల్‌ పోలీసులు గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. 25 శాతం కాలిన గాయాలున్నాయని, చేతులకు గాలి తగలకూడదని అక్కడి వరకూ కట్లు వేసినట్లు తెలిపారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి నాగర్ కర్నూల్ తరలించారు.


ఇదిలా ఉంటే, రాజేష్‌ చికిత్సకు రూ.3.45 లక్షలు కాగా రూ.1.88 లక్షలు స్వాతి కుటుంబం, రాజేష్ కుటుంబం చెల్లించింది. అసలు విషయం తెలిశాక వారంతా వెళ్లిపోవడంతో.. ఆ డబ్బు ఎవరు కడుతారన్నది తేలలేదు. దీంతో రాజేష్ ను డిశ్చార్జ్ చేసేందుకు వారు ఒప్పుకోలేదు. అయితే పోలీసులు కేసు గురించి చెప్పి రాజేష్‌ను నాగర్‌కర్నూల్‌కు తరలించారు.

విచారణలో ప్రియుడు ఇలా, 'పలువురితో చనువు, జల్సాలకు అలవాటుపడ్డ స్వాతి!' జైల్లో ఇలావిచారణలో ప్రియుడు ఇలా, 'పలువురితో చనువు, జల్సాలకు అలవాటుపడ్డ స్వాతి!' జైల్లో ఇలా

 పోలీసులు ఏమన్నారు?:

పోలీసులు ఏమన్నారు?:

సుధాకర్ రెడ్డిపై తనకెప్పుడూ ద్వేషం లేదని రాజేష్ చెప్పడం గమనార్హం. అటు పోలీసులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వాతే అని చెబుతున్నారు. కొల్లాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు.

భర్తను చంపిన స్వాతి: వెలుగులోకి మరో విషయం, రెండేళ్ల పరిచయంలో ఏడాదిగా, ఆ రోజేం జరిగిందంటే?భర్తను చంపిన స్వాతి: వెలుగులోకి మరో విషయం, రెండేళ్ల పరిచయంలో ఏడాదిగా, ఆ రోజేం జరిగిందంటే?

English summary
Rajesh, who accused in Sudhakar Reddy murder has revealed more details about that. He said often we meet at her home only when Sudhakar Reddy was not at home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X