వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

' మహిళా సంఘాలకు రూ.5లక్షల వడ్డీలేని రుణాలు, అభయ హస్తం కింద రూ.1000'

By Narsimha
|
Google Oneindia TeluguNews

వనపర్తి: అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందించనున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.మహిళలను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు వరాల జల్లును కురిపించేందుకు ప్లాన్ చేస్తోంది.

పోటీ చేయాలని కెసిఆర్ కోరారు,అండర్ డాగ్‌ను కాదు, రాజకీయ పార్టీ: కోదండరామ్పోటీ చేయాలని కెసిఆర్ కోరారు,అండర్ డాగ్‌ను కాదు, రాజకీయ పార్టీ: కోదండరామ్

వనపర్తిలో కాంగ్రెస్ మహిళా గర్జన సభ సోమవారం నాడు జరిగింది. ఈ సభలో పీసీపీ ఉత్తమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.గ్రామాల్లో నాలుగున్నర లక్షల సహకార సంఘాలు, పట్టణాల్లో లక్షన్నర సంఘాలు ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు.

డీలిమిటేషన్‌ సాధ్యం కాదు, మహకూటమికి సన్నాహలు: జానారెడ్డిడీలిమిటేషన్‌ సాధ్యం కాదు, మహకూటమికి సన్నాహలు: జానారెడ్డి

తెలంగాణలో 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రజలకు ఇప్పటినుండే హమీలను కురిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను ఏడాదికి ముందే ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?

మహిళలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు

మహిళలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు

తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. అధికారంలోకి వస్తే ప్రతి స్వయం సహయక సంఘానికి రూ.5 లక్షల రూపాయాల రుణాలను అందించనున్నట్టు పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.మహిళల ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఇంకా కొన్ని పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేని విషయాన్ని కూడ కాంగ్రెస్ పార్టీ అవకాశం దొరికినప్పుడల్లా ప్రస్తావిస్తోంది.

 అభయహస్తం కింద మహిళలకు వెయ్యి రూపాయిలు

అభయహస్తం కింద మహిళలకు వెయ్యి రూపాయిలు

2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రాగానే మహిళలకు అభయ హస్తం కింద వెయ్యి రూపాయలు ఇస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మహిళా సహకార సంఘంలో ఉన్న ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని, నాలుగు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

 మహిళా సంఘాల ఆర్గనైజర్లకు నెలకు రూ10 వేల జీతం

మహిళా సంఘాల ఆర్గనైజర్లకు నెలకు రూ10 వేల జీతం

ప్రతి మహిళా సంఘానికి లక్ష రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇవ్వబోతున్నామని పీసీసీ చీఫ్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

మహిళా సంఘాలకు గ్రామీణ స్థాయిలో రూ.15 లక్షలతో, మండల కేంద్రాల్లో 30 లక్షల నిధులతో భవనాలు నిర్మిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ఆర్గనైజర్లకు నెలకు పది వేల రూపాయలు జీతంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి జిల్లాలో మహిళ గర్జన సభలు

ప్రతి జిల్లాలో మహిళ గర్జన సభలు

ప్రతి జిల్లాలో మహిళ గర్జన సభలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.కేసీఆర్ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు..ఇంటికి ఒకరికి ఉద్యోగం కాదు కదా ఒక్క మహిళకు కూడా ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవి కూడ ఈ సభలో పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తోందని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆమె చెప్పారు.

English summary
PCC chief Uttam Kumar Reddy said that if the Congress comes to power in Telangana in 2019, it will provide Rs 5 lakh for self-help loans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X