వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్‌లోనే ఎన్నికలు, కాంగ్రెస్‌దే విజయం: ఉత్తమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్‌ మాసంలో ఎన్నికలు వస్తాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల రెండో విడత బస్సు యాత్రను ఆదివారం నాడు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తేది వరకు రెండో విడత బస్సు యాత్ర తెలంగాణ జిల్లాల్లో కొనసాగనుంది.

we will into power in 2019 elections in Telangana: Uttamkumar reddy

రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ యాత్రలో తాము ప్రజలకు వివరించనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు, స్పీకర్, ముఖ్యమంత్రి ఏ రకంగా వ్యవహరించారనే విషయమై ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు విషయమై కోర్టుకు అసెంబ్లీ సీసీ పుటేజీ దృశ్యాలు ఇవ్వలేకనే అడ్వకేట్ జనరల్ రాజీనామా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు కాగ్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై తాము కోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.

నిర్ణీత సమయానికి కంటే ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

English summary
PCC chief Uttam Kumar said that Congress party will gain into power in 2019 elections in Telangana state . Congress party second phase MLAs, MLC bus yatra started on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X