వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎఫ్డీతోనే నష్టం :ఫిజికల్ టెస్టులు రీ కండక్ట్ చేయండి, కోర్టును ఆశ్రయిస్తామంటోన్న ఎస్సైఅభ్యర్థులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఫిజికల్ టెస్టుల్లో భాగంగా తమకు అన్యాయం జరిగిందని బషీర్‌బాగ్‌లో నిరసనకు దిగారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు తప్పుపట్టారు. తమకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.

కొంపముంచిన ఆర్ఎఫ్టీ

కొంపముంచిన ఆర్ఎఫ్టీ

ఫిజికల్ టెస్టులో భాగంగా రేడియో ఫ్రిక్వెన్సీ టెస్ట్‌ను ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశ్యం .. ఫిజికల్ టెస్టుల్లో భాగంగా రన్నింగ్, ఇతర ఈవెంట్లను కచ్చితంగా కొలిచేందుకు ఉపయోగపడుతోందని తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. అంతకుముందు ఐదుగురు చేసే రన్నింగ్ .. ఇప్పుడు 50 మంది చేస్తే ఎలా లెక్కించగలుగుతారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు జరిగిన ఫిజికల్ టెస్టుల్లో అనర్హులు ఎంపికయ్యారని .. మళ్లీ ఫిజికల్ టెస్టులు రీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సాక్ష్యాలివిగో ..

సాక్ష్యాలివిగో ..

ఆర్ఎఫ్టీతో తాము నష్టపోయామని ఎస్సై అభ్యర్థులు పేర్కొన్నారు. ఓ అభ్యర్థి తక్కవ ఎత్తు ఉన్న ఎస్సై కొలువుకు ఎంపికయ్యారని ... మరో వ్యక్తి క్వాలిఫై కాలేదని ఫోటోను చూపించారు. ఆర్ఎఫ్టీతో తాము మోసపోయామని చెప్పడానికి సాక్ష్యం ఇదేనని చెప్తున్నారు. ఫిజికల్ టెస్ట్ రీ కండక్ట్ చేయడంతో తాము న్యాయం జరుగుతోందని .. రిక్రూట్ మెంట్ బోర్డును కోరారు. వాస్తవానికి మార్చి 22న శారీర దాఢుర్య పరీక్షలు ముగిసాయని .. మళ్లీ మార్చి 28న ఎందుకు నిర్వహించారని అభ్యర్థులు బోర్డును ప్రశ్నించారు. దీంతో ఏదో అవకతవక జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మెయిన్స్ పరీక్ష వాయిదా వేయండి ..

మెయిన్స్ పరీక్ష వాయిదా వేయండి ..

కొందరు అనర్హులను దొడ్డిదారిన ఎంపికచేశారని అభ్యర్థులు తెలిపారు. దీంతో తమకు అన్యాయం జరగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిజికల్ టెస్టుల్లో తమకు జరిగిన అన్యాయంపై స్పందించని బోర్డు ... మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎల్లుండి నిర్వహించబోయే మెయిన్స్ పరీక్షను వాయిదావేయాలని కోరారు. లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.

English summary
As part of the physical tests, si, constable candidates went to protest in Basheerbag. Police were detained while they were going to take up dharna at Indira Park. The police and the constable were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X