వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12న ఓటర్ల తుది జాబితా: తెలంగాణ సీఈఓ రజత్ కుమార్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రకటనకు హైకోర్టు అనుమతించిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ తెలిపారు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, వినతులకు సంబంధించి 33 లక్షల 14 వేలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో కొత్తగా ఓటుహక్కు కోసం వచ్చిన దరఖాస్తులు 22 లక్షల 36 వేలకు పైనే ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల 872 దరఖాస్తులను ఆమోదించినట్లు వెల్లడించారు.

ఉత్కంఠకు తెర: తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు, షెడ్యూల్ ఇదేఉత్కంఠకు తెర: తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు, 11న ఫలితాలు, షెడ్యూల్ ఇదే

We will release final voters list on 12th october, says Rajat kumar

ముసాయిదా జాబితాలో 2 కోట్ల 61 లక్షల ఓటర్లు ఉండగా.. తుది జాబితాలో మరో 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

English summary
We will release final voters list on 12th october, says Telangana CEO Rajat kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X