వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనవైపే, 5ఎమ్మెల్సీలు మావే: కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏడాది పాలనపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, వాటర్ గ్రిడ్ ప్రారంభించిన తరువాత ఈ ప్రభావం ఇంకా బాగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. శాసన మండలి ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో శుక్రవారం కెసిఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రభుత్వ పని తీరు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడారు.

విద్యుత్‌తో పాటు అనేక అంశాల్లో తెలంగాణ సంక్షోభంలో పడిపోతుందని, రకరకాల దుష్ప్రచారం చేశారని, కానీ ఏడాది పాలనలో అవన్నీ పటాపంచలు అయ్యాయని కెసిఆర్ అన్నారు. మండలి ఎన్నికల్లో ఐదు సీట్లు మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక సీటు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు.

శనివారం, ఆదివారం రెండురోజుల పాటు ఎమ్మెల్యేలకు తెలంగాణ భవన్‌లో మాక్ ఓటింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. శనివారం సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు జరిగే మాక్ ఓటింగ్‌లో పాల్గొని ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన అభ్యర్థికి ఓటు వేయాలని అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల కోటా కింద 12 స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు.

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 11 స్థానాలు మనమే గెలుస్తామని కెసిఆర్, పార్టీ ఎమ్మెల్యేలకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, పలు సర్వేల్లో ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ లేదని కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.మిషన్ కాకతీయ పనుల పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోందని తెలిపారు.

ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం, కష్టపడి పని చేసి బంగారు తెలంగాణ సాకారం చేసుకుందామని కెసిఆర్ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రజల్లో వచ్చిన స్పందన చూసి అంతా ఆశ్చర్యపోతున్నారని, చిత్తశుద్ధితో పని ప్రారంభిస్తే ప్రజలు పార్టీలకు అతీతంగా స్పందిస్తారని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఏడాది పాలనపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, వాటర్ గ్రిడ్ ప్రారంభించిన తరువాత ఈ ప్రభావం ఇంకా బాగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

శాసన మండలి ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో శుక్రవారం కెసిఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రభుత్వ పని తీరు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడారు.

కెసిఆర్

కెసిఆర్

విద్యుత్‌తో పాటు అనేక అంశాల్లో తెలంగాణ సంక్షోభంలో పడిపోతుందని, రకరకాల దుష్ప్రచారం చేశారని, కానీ ఏడాది పాలనలో అవన్నీ పటాపంచలు అయ్యాయని కెసిఆర్ అన్నారు. మండలి ఎన్నికల్లో ఐదు సీట్లు మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఒక సీటు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday said that their party will win 5 MLC seats in MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X