వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా ఎపెక్ట్: కాంగ్రెస్ తో దోస్తికి రేవంత్ రెడ్డి సై

తెలంగాణలో ప్రత్యామ్యాయవేదిక ఏర్పాటు కోసం టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది. తెలంగాణలో టిడిపితో పొత్తు ఉండబోదనే సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకత్వం ఈ మేరకు చర్యలను తీసుకొంటోంది. కాంగ్రెస్, కమ్యూ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తెలంగాణలో ప్రత్యామ్యాయవేదిక ఏర్పాటు కోసం టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది. తెలంగాణలో టిడిపితో పొత్తు ఉండబోదనే సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకత్వం ఈ మేరకు చర్యలను తీసుకొంటోంది. కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పనిచేసేందుకు సిద్దమని టిడిపి తెలంగాణ నాయకులు ప్రకటిస్తున్నారు.ఈ మేరకు టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.

2014 ఎన్నికల సమయంలో టిడిపి బిజెపిలు పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీచేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది.అయితే ఆనాడు ఎన్నికల సమయంలో కూడ తెలంగాణలో బిజెపి నాయకులు టిడితో పొత్తును వ్యతిరేకించారు.

కానీ, జాతీయ అవసరాలరీత్యా టిడిపితో పొత్తు అవసరమని బిజెపి నాయకత్వం స్థానిక నాయకత్వాన్ని ఒప్పించింది.అయితే ఎన్నికల తర్వాత తెలంగాణలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి ప్రజాప్రతినిధులు, నాయకులు ఫిరాయించారు.తెలంగాణలో టిడిపి బలహీనపడిందని బిజెపి నాయకత్వం భావిస్తోంది.ఈ తరుణంలో 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని బిజెపి భావిస్తోంది.

కాంగ్రెస్ తో సహ ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహించి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకొనేందుకుగాను బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ తరుణంలో ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించుకోవాల్సిన అవసరం టిడిపికి అనివార్యమైంది.దీంతో కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పోటీచేసేందుకు సిద్దమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పనిచేసేందుకు సిద్దం

కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పనిచేసేందుకు సిద్దం

కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పనిచేసేందుకు సిద్దమనే అభిప్రాయాన్ని తెలంగాణ టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు.బిజెపి నాయకులు టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు.అయితే కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పనిచేసేందుకు ఆ పార్టీ వ్యూహారచన చేస్తోంది. తెలంగాణలో ప్రత్యామ్నాయరాజకీయవేదిక ఏర్పాటు కోసం సిపిఎం ప్రయత్నాలను చేస్తోంది. పవన్ కళ్యాణ్, కోదండరామ్, గద్దర్ లతో పాటు ఇతర కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కూడగట్టి ప్రత్యామ్నాయవేదికను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.అయితే టిడిపి కూడ ఇదే తరహ ఆలోచన చేస్తోంది. టిఆర్ఎస్ ను గద్దెదించేందుకుగాను కలిసివచ్చే పార్టీలు, శక్తులను కలుపుకొనిపోతామని ఆ పార్టీ ప్రకటించింది.

.కెసిఆర్ వ్యతిరేకశక్తులను ఏకతాటి మీదికి

.కెసిఆర్ వ్యతిరేకశక్తులను ఏకతాటి మీదికి

2019 ఎన్నికల్లో కెసిఆర్ వ్యతిరేకశక్తులను, పార్టీలను ఏకతాటి మీదికి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇందుకు రాజకీయ పునరేకీకరణ అవసరమని విపక్షాలు భావిస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ తన బద్దశత్రువు లాలూతో చేతులు కలిపాడు.అయితే అదే తరహ ఫార్మూలాను తెలంగాణలో కూడ అమలు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. కెసిఆర్ వ్యతిరేక ఓట్ల చీలికవల్ల టిఆర్ఎస్ కు ప్రయోజనం కలుగుతోంది.అయితే దాన్ని నివారించేందుకుగాను విపక్షాలన్నీ ఏకతాటి మీదికి తీసుకురానున్నారు.

ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు

ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు

తెలంగాణలో బిజెపి నేతలు టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ఇదే అభిప్రాయంతో కమలనాథులున్నారు.అయితే ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని టిడిపి నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీల పరస్పరపోటీ, మిత్రపక్షంగా బరిలోకి దిగిన విషయాన్ని తెలంగాణ టిడిపి నాయకులు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో టిడిపి, బిజెపి నేతల మధ్య కొనసాగుతున్నఅంతరం

తెలంగాణలో టిడిపి, బిజెపి నేతల మధ్య కొనసాగుతున్నఅంతరం

తెలంగాణ రాష్ట్రంలో టిడిపి బిజెపి నేతల మధ్య ఆంతరం పెరుగుతూ వస్తోంది. టిడిపి నుండి ఇతర టిఆర్ఎస్ లోకి వలసలు పెరగడం.. ఆ పార్టీ బలహీనపడడంతో బిజెపి నాయకులు ఆ పార్టీ పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.ఈ రెండు పార్టీల మధ్య అంతరం కొనసాగుతోంది. జిహెచ్ ఎం సి ఎన్నికల సమయంలో కూడ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత ఈ పరిస్థితి ఇంకా ఎక్కువైంది.

English summary
తెలంగాణలో ప్రత్యామ్యాయవేదిక ఏర్పాటు కోసం టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది. తెలంగాణలో టిడిపితో పొత్తు ఉండబోదనే సంకేతాలను ఇచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకత్వం ఈ మేరకు చర్యలను తీసుకొంటోంది. కాంగ్రెస్, కమ్యూనిష్టులతో కలిసి పనిచేసేందుకు సిద్దమని టిడిపి తెలంగాణ నాయకులు ప్రకటిస్తున్నారు.ఈ మేరకు టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X