హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలోనే తొలి అడుగు, హైద్రాబాద్‌లో ఐకియా ప్రారంభం: ఏం దొరుకుతాయి.. ప్రత్యేకతలివే!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

హైద్రాబాద్‌లో ఐకియా షోరూమ్ ను ప్రారంభించిన కేటిఆర్

హైదరాబాద్: హైటెక్స్‌లో ఐకియా హోం ఫర్నిషింగ్ స్టోర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐకియా గ్రూప్ సీఈవో జెస్పర్ బ్రోడిన్, ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తదితరులు పాల్గొన్నారు. అందరికి ధరలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ స్టోర్‌ను ప్రారంభించినట్లు ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో తొలి స్టోర్‌ను తెలంగాణలో దిగ్విజయంగా ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలో రూ.10,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు రూ.4500 కోట్లు వెచ్చించామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి ఐకియా షూరూం తెలంగాణలో ప్రారంభమైంది.

హైదరాబాదులో పెట్టుబడులకు ఆసక్తి

హైదరాబాదులో పెట్టుబడులకు ఆసక్తి

హైదరాబాదులో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐకియా ద్వారా దాదాపు రెండు వేలమ మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 3వేల మందికి పరోక్షంగా వస్తాయని తెలిపారు. హైదరాబాదు స్టోర్ కోసం రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇతర ప్రాంతాల్లో మరో రూ.3500 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

 ప్రత్యేక ఆఫర్లు.. ఏం దొరుదుతాయంటే?

ప్రత్యేక ఆఫర్లు.. ఏం దొరుదుతాయంటే?

కాగా, షోరూంకు వచ్చే వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐకియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇంట్లో ఉపయోగించే చిన్న వస్తువులు మొదలు గది అలంకరణ, సామాగ్రి, ఫర్నీచర్ ఇలా దాదాపు 7500 రకాల వస్తువులు ఐకియా స్టోర్‌లో దొరుకుతాయి. వంట గది, పడక గది, హాలు తదితరాల నమూనాలు ఉంటాయి. భారత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వెయ్యికి పైగా ఇళ్లను సందర్శించి సర్వే చేసినట్లు తెలిపారు. విక్రయించే వస్తువుల్లో ఇరవై శాతం వరకు ఇక్కడ తయారైనవేనని, మున్ముందు ఇంకా పెరుగుతాయన్నారు. దీనికోసం స్థానిక తయారీదారులు, సరఫరాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

రెస్టారెంటు, పిల్లలు ఆడుకునేందుకు స్మాలాండ్

రెస్టారెంటు, పిల్లలు ఆడుకునేందుకు స్మాలాండ్

ఐకియాలో ఓ ప్రత్యేక రెస్టారెంటును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో తక్కువ ధరలకే ఆహార పదార్థాలు అందించనున్నారు. దేశీయ వంటకాలతో పాటు, స్వీడిష్‌ రుచులను పరిచయం చేస్తారు. ఇందులో ఒకేసారి 1,000 మంది కూర్చోవడానికి వీలు కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే ఉన్న స్మాలాండ్‌లో ఆడుకునేందుకు వదిలిపెట్టి, స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఐకియా ప్రత్యేకతలు

ఐకియా ప్రత్యేకతలు

హైటెక్ సిటీ వద్ద 13 ఏకరాల స్థలంలో సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 7500 రకాల వస్తువులు లభిస్తాయి. ఇందులో వెయ్యికి పైగా వస్తువుల విలువ రూ.200 లోపే. ప్రత్యక్షంగా దాదాపు వెయ్యి మందికి ఉపాది. సగం మంది మహిళా ఉద్యోగాలు. పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి. ఏటా లక్షలాది మంది ఈ స్టోర్‌ను సందర్శించే అవకాశం. ఈ స్టోర్ 365 రోజులు ఉదయం పది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.

English summary
Welcome another marquee brand entering India through our own Hyderabad & Telangana. Along with Klas Molin, Ambassador, swedeninIndia, Jesper Brodin, CEO, IKEA Group and Peter Betzel, CEO, IKEA India formally inaugurated IKEA store in Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X