• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాన మంత్రిగా దేశానికి ఏంచేసారు.?ఏడేళ్లుగా ప్రయోగాలు తప్ప పాలన లేదన్న కాంగ్రెస్.!

|

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా స్పందించింది. ఏడేళ్ల క్రితం దేశం అభివృద్ధి పథంలో పయనించి ప్రపంచంలో ఒక ఆదర్శవంతమైన ఆర్థిక దేశంగా ఎదిగిన క్రమంలో నరేంద్ర మోడీ పాలన ఈ దేశాన్ని ప్రపంచంలో పేద దేశంలో ఒక దేశంగా నిలిపారని ఏ ఐ సి సి కార్యదర్శి, ఎం ఏ సంపత్ కుమార్ ఘాటుగా విమర్శించారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్ ధరలు దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితి, విపరీతమైన నిరుద్యోగ రేటు, వ్యవసాయం విషయంలో నిర్లక్ష్యం, ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్న హామీలు, జీఎస్టీ అమలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో నరేంద్ర మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.

 అభివృద్ది మచ్చుకైనా లేదు.. మోదీ ఏడేళ్లుగా భ్రమలు కల్పిస్తూ నెట్టుకొచ్చారన్న కాంగ్రెస్..

అభివృద్ది మచ్చుకైనా లేదు.. మోదీ ఏడేళ్లుగా భ్రమలు కల్పిస్తూ నెట్టుకొచ్చారన్న కాంగ్రెస్..

కేవలం మతాన్ని రెచ్చగొట్టడం సాంప్రదాయాల ముసుగులో జాతి, దేశం అంటూ గొప్పలు చెప్పుకుని ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునే దుర్మార్గం తప్ప బీజేపి దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదని ఎం ఏ సంపత్ కుమార్ మండిపడ్డారు. ఈ దేశ ప్రజలకు అవసరమైన ఉద్యోగాలు ఉపాధి కల్పన ఆర్థిక స్వావలంబన, భద్రత ఇలాంటివి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ చేపట్టలేకపోయారని, నేడు ప్రపంచంలో భారతదేశం అంటే మసకబారిన చీకటి దేశం గా నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం ఒక వెలుగు వెలిగితే దేశంలో నేడు చీకటి రోజులు కనిపిస్తున్నాయని సంపత్ ఆవేదన వ్యక్తం చేసారు.

సిగ్గుపడాలన్న కాంగ్రెస్..

సిగ్గుపడాలన్న కాంగ్రెస్..

బీజేపి ఏడేళ్ల పాలనపై సంబరాలా.? సిగ్గుపడాలన్న కాంగ్రెస్..
ఇలాంటి విపత్కర తరుణంలో బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ పాలన పై సంబురాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్యగా సంపత్ అభివర్ణించారు. వ్యవసాయ బిల్లు అమలు చేస్తే అవి రైతాంగానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయని, గత ఏడాదికి పైగా దేశంలోని కోట్లాది మంది రైతులు దీక్షలు, ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తూ, వ్యవసాయ రంగాన్ని అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో మునుపెన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య నెలకొందని, తినడానికి తిండి లేక ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతుంటే, నరేంద్ర మోడీ పాలన బాగుంది అంటూ బీజేపీ బిజెపి నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారని సంపత్ మండిపడ్డారు.

 మోదీ పాలనలో నిరుద్యోగం పడగ విప్పింది.. దేశం తిరోగమిస్తోందని కాంగ్రెస్ ఘాటు విమర్శ

మోదీ పాలనలో నిరుద్యోగం పడగ విప్పింది.. దేశం తిరోగమిస్తోందని కాంగ్రెస్ ఘాటు విమర్శ

అంతే కాకుండా నోట్లు రద్దు చేసి దేశాన్ని అంధకారంలోకి నెట్టేసారని, జీఎస్టీ అమలు చేసి ఆర్థికంగా దిగజార్చారని, లక్షలాది కంపెనీలు మూత పడి కోట్లాది ఉద్యోగాలు పోయి, జనం రోడ్డు పాలయ్యారని సంపత్ ఆవేదన వ్యక్తం చేసారు. ఒక కొత్త ఉద్యోగం రాలేదని, ఉపాధి రంగానికి ప్రధాన్యత ఇచ్చింది లేదని, అభివృద్ధి కుంటుపడడంతో ఆర్థిక మాంద్యం తీవ్రంగా పెరిగిపోయిందని అన్నారు. నేడు దేశంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల వల్ల ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి దాపురించిందని సంపత్ మండిపడ్డారు.

 మోదీ ఏడేళ్ల పాలన ఓ అబూత కల్పితం.. గంగా నదిలో కొట్టుకుపోతున్న శవాలే సాక్ష్యం అన్న సంపత్..

మోదీ ఏడేళ్ల పాలన ఓ అబూత కల్పితం.. గంగా నదిలో కొట్టుకుపోతున్న శవాలే సాక్ష్యం అన్న సంపత్..

ఏడేళ్ల కాలంలో చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారని, నేడు నిరుద్యోగం తార స్థాయికి చేరిందని, ఉద్యోగాల కోసం జనం క్యూ లు కడుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని ధ్వజమెత్తారు సంపత్. తిండి కోసం, మందుల కోసం, వాక్సిన్ల కోసం చివరకు శవాలను కాల్చడం కోసం కూడా క్యూ లు కట్టే దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ పాలన ఎలా ఉందో గంగా నదిలో కొట్టుకుపోతున్న శవాలను అడిగితే చెప్తాయని ఎద్దేవా చేసారు. దేశం అగమ్యగోచరంలో పడిపోయి ప్రపంచం ముందు తల దించుకునేల పరిస్థితులు తలెత్తడం శోచనీయమన్నారు సంపత్.

  Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
  English summary
  Seven years ago, the country embarked on a development trajectory and grew into an ideal economic nation in the world.AICC secretary Sampath Kumar has strongly criticized the Narendra Modi regime for keeping India the poorest country in the world.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X