వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ కాంగ్రెస్ కు ఎమైంది....? ఓ వైపు టిఆర్ఎస్ ...మరో వైపు బిజేపి....ఎవరు నోరు మెదపరేంది..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఈ కాంగ్రెస్ కు ఏమైంది....? ఓ వైపుTRS..మరో వైపుBJP..!! | Oneindia Telugu

తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది..గెలిచిన ఎమ్మెల్యేలు ఓవైపు టిఆర్ఎస్ కు మరోవైపు బిజేపిలోకి వెళుతున్నారు. ..పార్టీకి రాష్ట్రంలో సరైన నాయకులు లేరా, ఉన్నా ఎవ్వరిని పట్టించుకోవడం లేదా.. మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తోంది,ఎవ్వరు సప్పుడు చేయడం లేదనా.. ఓ వైపు టిఆర్ఎస్, మరో వైపు బిజేపి పార్టీల్లోకి వెళుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది....

తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది....

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి షాక్‌ మీద షాక్‌లు తగులుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే పార్టీ వీడి.. కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో భంగపడ్డ కాంగ్రెస్‌కు.. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ టెన్షన్ పెడుతోంది. కనీసం ప్రతిపక్ష హోదా అయినా మిగులుతుందా అని అధిష్టానం తలలు పట్టుకుంటోంది. సీనియర్లు, కీలక నేతలు సైతం.. టిఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ వలలో పడుతున్నారు. దీంతో అసెంబ్లీలో ఒకరిద్దరు మినహా.. కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది...

ఇప్పటి వరకు టిఆర్ఎస్ చేరిన ఎమ్మెల్యేలు

ఇప్పటి వరకు టిఆర్ఎస్ చేరిన ఎమ్మెల్యేలు

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), హరిప్రియ (ఇల్లందు), సబితా రెడ్డి (మహేశ్వరం), ఉపేందర్ రెడ్డి (పాలేరు) దేవిరెడ్డి సుదీర్ రెడ్డి (ఎల్బినగర్) వనమా వెంకటేశ్వర్‌రావు ( కొత్తగూడెం ) తాజాగా నేడు కోల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలిసి టిఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు..

కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?

బిజేపిలో కి చేరికలు..

బిజేపిలో కి చేరికలు..

ఇక స్థానికంగా ఉన్న ఆధికార టిఆర్ఎస్ తోనే సతమతమవుతుంటే మరోవైపు జాతియా స్థాయిలో ఉన్న బిజేపి సైతం కాంగ్రెస్ పార్టీని ఊపిరాడనివ్వట్లేదు. తాజగా కాంగ్రెస్ పార్టీ నుండి గద్వాల మాజి ఎమ్మెల్యే, డి.కే ఆరుణ బిజేపి కండువా కప్పుకున్నారు..ఈనేపథ్యంలోనే మాజి మంత్రి జానరెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి,లు పార్టీలో చేరుతున్నట్టు సమాచారం.వీరితోపాటు మరింత మంది బీజేపిలో చేరేందుకు సన్నహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది..

కాంగ్రెస్ లో చివరికి మిగిలేది ఎవరు

కాంగ్రెస్ లో చివరికి మిగిలేది ఎవరు

గత ఎన్నికల్లో తెరాస 88 సీట్లు గెలిచింది. ఆ తర్వాత స్వతంత్రులు పార్టీలో చేరారు. దీంతో తెరాస బలం 90గా ఉంది. ప్రస్థుతం ఆపరేషన్ ఆకర్ష్ తో తోమ్మిది మంది సభ్యులు కాంగ్రెస్‌, చేరారు.కాగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య 19 నుంచి 10కు తగ్గుతుంది. కాగా, తెరాసతో మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ...దీంతో అయిదు నుండి ఆరుగురు మాత్రమే మిగిలే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ అదినాయకత్వం ఏం చేస్తోంది.

కాంగ్రెస్ అదినాయకత్వం ఏం చేస్తోంది.

మరి రెండు పార్టీల వైపు గెలిచిన ఎమ్మెల్యేలు, బలం ఉన్న నాయకులు వెళుతుంటే పార్టీ నాయకత్వం ఏం మాట్లాడకుండా ఉంటుంది..పార్టీ ఎమ్మెల్యేలు ,నాయకులు ,క్యాడర్ పై ఓ కన్నేసి ఉంచాల్సిన నాయకత్వం మిన్నకుండి పోతుంది..దీంతో ప్రజా ప్రయోజనాల కోసమో లేక స్వలాభం కోసమో కాని నాయకులు పార్టీని వీడుతున్నారు..దీంతో వంద సంవత్సరాల చరిత్ర గలిగిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమైంది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. మళ్లి పార్టీకి పునర్ వైభవం మాట అటుంచి, ఉన్న నాయకులును కాపాడుకునే పరిస్థితి కనపడడం లేదు.... సబితా ఇంద్రా రెడ్డి, డి.కే అరుణ లాంటీ వంటి నాయకురాల్లే పార్టీని వీడటంతో ఎవరు ఉంటారు.. పార్టీల పిరాయింపులకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనే ఆందోళనలో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.

English summary
what happening in the Telangana Congress? why The winning MLAs,and leaders are going to TRS & BJP there is no right party leaders in the state ?no one mind the leaders,what is party highcommand doing ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X