• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతు చిక్కని కేసీఆర్ వ్యూహాలు- రేవంత్ శిబిరంలో డైలమా : ఢిల్లీలో కాంగ్రెస్ తో కలిసిన టీఆర్ఎస్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చేస్తున్నాయి. వ్యూహాల్లో దిట్ట అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితం తరువాత బీజేపీ టార్గెట్ గా ముఖ్యమంత్రి కమలనాధులను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల పైన గురి పెట్టారు. అందులో భాగంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సీఎం నేరుగా ధర్నా చేసారు. ఇక, ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలిపింది.

టీఆర్ఎస్ కొత్త ఎత్తుగడలు

టీఆర్ఎస్ కొత్త ఎత్తుగడలు

ధాన్యం కొనుగోలు పైన దేశ వ్యాప్తంగా ఒకే పాలసీ అమలు చేయాలంటూ.. టీఆర్ఎస్ ఎంపీలు సభల్లో నిరసనకు దిగారు. తాజాగా పార్లమెంట్ లో పరిణామాల పైన కాంగ్రెస్ నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు హాజరయ్యారు. అయితే, కొద్ది కాలం క్రితం వరకు బీజేపీ కంటే కాంగ్రెస్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా కేసీఆర్ భావించేవారు. ప్రధాని మోదీ..కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేసీఆర్ కొద్ది కాలం క్రితం వరకూ సత్సంబంధాలే కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పైన మాత్రం ఫైర్ అయ్యేవారు.

కేసీఆర్ రాజకీయ వ్యూహాలతో..

కేసీఆర్ రాజకీయ వ్యూహాలతో..

ఇక, ఇప్పుడు కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు..2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆయన సైతం పార్టీలో అంతర్గత సమస్యలు..ఆయనకు వ్యతిరేకంగా వాయిస్ లు వినిపిస్తున్నా ముందుకు వెళ్తున్నారు. ఇక, ఇప్పుడు హుజూరాబాద్ లో కాంగ్రెస్ కనీస ఓట్లు సాధించక పోవటం... బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరుతో కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్దిగా బీజేపీ అన్నట్లుగా సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీ అధినాయకత్వం సైతం అదే స్థాయిలో తెలంగాణ నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వయా కాంగ్రెస్

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వయా కాంగ్రెస్

దీంతో..ఇప్పుడు తెలంగాణలో రాజకీయ యుద్దం టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ గా మారింది. ఇక, ఈ సమయంలోనే కాంగ్రెస్ అధినాయకత్వం కేంద్రానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో టీఆర్ఎస్ నేతలు పాల్గొనటం ద్వారా బీజేపీ నేతల చేతికి అస్త్రం చిక్కింది. టీఆర్ఎస్.. కాంగ్రెస్ కలుస్తారనే ప్రచారం చేయటానికి వీలు ఏర్పడింది. ఇది రేవంత్ క్యాంపును డైలమాలోకి నెడుతోంది. అయితే, పార్లమెంట్ లో పరిణామాల పైనే తాము ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొన్నామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డజను మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడంపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.

కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్

కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్


టీఆర్ఎస్ కు రాజ్యసభలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ సైతం ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఉమ్మడి ప్రకటనపై టీఆర్ఎస్ సంతకం చేసింది. అయితే, టీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది ప్రతిపక్ష సమావేశమని, కాంగ్రెస్ నేతృత్వంలోని సమావేశం కాదని చెప్పుకొచ్చారు. బీజేపీతో ఫైట్ చేస్తున్న టీఆర్ఎస్ తాము ఎక్కడా రాజీ పడటం లేదనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది ఒక్క అంశానికే పరిమితంగా చూడాలని..మొత్తంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి నడుస్తున్నట్లుగా చూడవద్దని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

అక్కడికే పరిమితం..ఇక్కడ మాత్రం...

అక్కడికే పరిమితం..ఇక్కడ మాత్రం...

అయితే, ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిన పొలిటికల్ వార్... ఈ సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో హాజరు కావటం తెలంగాణ కాంగ్రెస్ కు ఇరకాటంలోకి నెట్టే వ్యవహారంగా మారుతోంది. ఏపీకి చెందిన టీడీపీ..వైసీపీ లు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వ్యూహం టీఆర్ఎస్ కు బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చినా... భవిష్యత్ రోజుల్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ మైత్రి పైన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పుడుతుందనే చర్చ వినిపిస్తోంది.

English summary
In a shocker , TRS party had attended a opposition meeting that was led by congress for the first time since 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X