హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రిని బెదిరించేందుకే విక్రమ్ డ్రామా, ఇలా కాల్చుకున్నాడు: అసలేం జరిగింది?

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. విక్రమ్ నివాసంలో సీఐడీ, బంజారాహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు అధికారులు సోదాలు నిర్వహించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌పై ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. విక్రమ్ నివాసంలో సీఐడీ, బంజారాహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు అధికారులు సోదాలు నిర్వహించారు.

చదవండి: విక్రమ్‌పై కాల్పులు: ట్విస్ట్, ఆత్మహత్యాయత్నం నాటకమా?

ఫిలింనగర్‌ ప్రాంతంలోని రోడ్‌ నెంబర్‌ 86లో గల విక్రమ్ నివాసంలో తెల్లవారుజామున కాల్పులు చోట చేసుకున్నాయి. ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు సీసీ కెమెరాలు పని చేయడం లేదని తేల్చారు.

స్పృహలో ఉన్నప్పటికి విక్రమ్ అసలు విషయం చెప్పట్లేదా?

స్పృహలో ఉన్నప్పటికి విక్రమ్ అసలు విషయం చెప్పట్లేదా?

ఘటనా స్థలిలో క్లూస్‌ టీం రక్తపు మరకలు, వేలిముద్రలు సేకరించింది. విక్ర‌మ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన వాహనాన్ని త‌నిఖీ చేశారు. కాల్పుల‌కు సంబంధించిన తుపాకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్ర‌మ్ శరీరంలో ల‌భించిన బుల్లెట్ల ఆధారంగా 7.36 ఎంఎం తుపాకి వాడిన‌ట్లు గుర్తించారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న విక్ర‌మ్ నోరు విప్పితేనే కేసు కొలిక్కి వ‌స్తుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. కానీ విక్రమ్ స్పృహలో ఉన్నప్పటికీ ఏం జరిగిందనే అసలు విషయం చెప్పడం లేదని తెలుస్తోంది.

Recommended Video

Congress Leader Mukesh Goud's Son Vikram Goud Shot at Banjara Hills
ఇలా తుపాకీతో కాల్చుకున్నాడు

ఇలా తుపాకీతో కాల్చుకున్నాడు

విక్రమ్ గౌడ్ తనను తాను తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తొలుత ఎడమ చేతిలో తుపాకీ ఉంచుకొని కుడిచేతిని కాల్చుకున్నాడు. ఆ తర్వాత వెంటనే కుడి చేతికి తుపాకీ తీసుకొని వీపుపై కాల్చుకున్నాడు. మొత్తంగా కాల్పుల ఘటన నుంచి ఆసుపత్రికి తరలించే వరకు డ్రాగామా కనిపిస్తోందని పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.

దూరం పెట్టిన తండ్రి, బెదిరించేందుకే, రూ.30 కోట్ల అప్పు

దూరం పెట్టిన తండ్రి, బెదిరించేందుకే, రూ.30 కోట్ల అప్పు

గత కొంతకాలంగా తండ్రి ముఖేష్ తన కొడుకు విక్రమ్‌ను దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో తండ్రిని బెదిరించేందుకే ఈ కాల్పుల డ్రామా ఆడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని సమాచారం. విక్రమ్‌కు రూ.30 కోట్ల అప్పుల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు సినిమాలకు విక్రమ్ ఫైనాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఫైనాన్షియర్లతో గొడవ, భార్యతో ఇంటికి, అర్ధరాత్రి ఏం జరిగింది?

ఫైనాన్షియర్లతో గొడవ, భార్యతో ఇంటికి, అర్ధరాత్రి ఏం జరిగింది?

విక్రమ్ గౌడ్‌కు ఫైనాన్షియర్లతో గొడవ జరిగిట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి గం.12.50 నిమిషాలకు భార్యతో కలిసి ఇంటికి వచ్చారు. మధ్య రాత్రి రెండు యాభైకి నిద్ర లేచాడు. గం.3.15 నిమిషాలకు కింది ఫ్లోర్‌కు వచ్చాడు. ఆ తర్వాత కాల్చుకున్నాడు. అనంతరం గం.3.32 నిమిషాలకు అతనిని భార్య అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పని మనిషి రక్తపు మరకలు తుడిచేసిందని తెలుస్తోంది.

పబ్ వ్యాపారంలో నష్టాలు, సినిమా వాళ్లతో సంబంధాలు

పబ్ వ్యాపారంలో నష్టాలు, సినిమా వాళ్లతో సంబంధాలు

విక్రమ్‌కు పబ్ వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే డ్రగ్ ముఠాతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అప్పులు చెల్లించాలని ఒత్తిడి. వీటన్నింటి ఒత్తిడి నేపథ్యంలో అతను కాల్చుకొని ఉంటాడని అంటున్నారు. డబ్బు చెల్లించాలని తనకు వచ్చిన సందేశాలను భార్య, ఓ పోలీస్ అధికారికి పంపించాడని సమాచారం. సినిమా వాళ్లతోనే సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారని సమాచారం.

విచారణ

విచారణ

క్లూస్ టీం విక్రమ్ గౌడ్ ఇంట్లో విచారణ జరిపారు. విక్రమ్ భార్య, పని మనిషి, వాచ్ మెన్‌ల నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. రెండు తుపాకీ దొరికితే వాస్తవాలు మరిన్ని తెలుస్తాయని భావిస్తున్నారు.

English summary
Congress leader Mukesh Goud's son Vikram Goud gun fire case is taking so many twists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X