వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ వాఖ్య‌ల‌కు అర్థం అదేనా..? ఆంద్ర ఓట‌ర్ల‌కు మ‌ళ్లీ గాలం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ‌లో జీహెచ్ఎమ్సీ ఎన్నిక‌లు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు పున‌రావ్రుతం అవుతున్నాయి. స్థానిక సంస్థ‌ల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు కాబ‌ట్టి స్థానిక ప్ర‌జానికంపై ఫోక‌స్ పెట్టిన‌ గులాబీ పార్టీ అప్ప‌ట్లో సెటిల‌ర్ప్ కి పెద్ద‌యెత్తున వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. గులాబీ బాస్ చంద్ర‌శేఖ‌ర్ రావు ఒక‌డుగు ముందుకేసి ఆంద్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే త‌న పంటితో తీస్థాన‌ని, ఆంద్రుల‌ను త‌న గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఆంద్రా ప్ర‌జానికానికి అండ‌గా అనేక హామీలు గుప్పిస్తున్నారు. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రుల‌కు అన్నివిధాల స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పిన కేటీఆర్ వ్యాఖ్య‌ల వెన‌క మ‌త‌లబు అదేనా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 సెటిల‌ర్ల‌కు గాలం వేస్తున్న టిఆర్ ఎస్..! రంగంలోకి దిగిన కేటీఆర్..!!

సెటిల‌ర్ల‌కు గాలం వేస్తున్న టిఆర్ ఎస్..! రంగంలోకి దిగిన కేటీఆర్..!!

తెలంగాణా రాష్ట్ర స‌మితి సెటిల‌ర్లకు మ‌రింత చేరువ‌య్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సీట్లు కార్పోరేట‌ర్ స్థానాల‌కు ప‌లు స్థానాలు కేటాయించిన గులాబి పార్టీ రాబోయే ఎన్నిక‌ల్లో కూడా సెటిల‌ర్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు పావులు క‌దుపుతోంది. మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్య‌లతో సెటిల‌ర్లు పార్టీకి చేరువవ్వ‌డం ఖాయ‌మ‌న్న ధీమాను గులాబి నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణా ఉద్య‌మ సమ‌యంలో గులాబి పార్టీకి దూరంగా ఉన్న సెటిల‌ర్లు ఆ త‌ర్వాత క్రమంగా అధికార పార్టీకి చేరువ‌య్యేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

మూడు, నాలుగు జిల్లాల్లో ప్ర‌భావం..! అందుకే ఆంద్రుల‌కు వ‌రాలు గుప్పిస్తున్న గులాబీ పార్టీ..!!

మూడు, నాలుగు జిల్లాల్లో ప్ర‌భావం..! అందుకే ఆంద్రుల‌కు వ‌రాలు గుప్పిస్తున్న గులాబీ పార్టీ..!!

పార్టీ పరంగా, ప్ర‌భుత్వ ప‌రంగా సెటిల‌ర్ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నామ‌న్న సంకేతాల‌ను సిఎం కేసిఆర్ ఇవ్వ‌డంతో గ్రేట‌ర్ ప‌రిధిలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సెటిల‌ర్లు అధికార పార్టీకి చేరువ‌య్యారు. దాని ఫ‌లితం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో తేలి పోయింది. సెటిల‌ర్లు ప్రభావితం చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా సామాజిక వ‌ర్గాల‌కు గులాబి పార్టీ స్థానాలు కేటాయించ‌డంతో వారంతా విజ‌యం సాధించారు. అయితే విభ‌జ‌న స‌మ‌స్య‌ల విష‌యంలో ఆంధ్ర‌, తెలంగాణా రాష్ట్రాల మ‌ధ్య ఒక్క సారిగా వాతావ‌ర‌ణం వేడెక్క‌డంతో సెటిల‌ర్ల‌ను కాపాడుకునేందుకు అధికార పార్టీ పావులు క‌దుపుతోంది.

 రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన కేటిఆర్ వ్యాఖ్య‌లు..!!

రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన కేటిఆర్ వ్యాఖ్య‌లు..!!

మ‌రో 50 రోజుల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నే టిఆర్ ఎస్ సెటిల‌ర్ల‌లోనూ ధీమా క‌ల్పించే య‌త్నం చేస్తోంది. గ్రేట‌ర్ తో పాటు ఖ‌మ్మం, నిజామాబాద్ జిల్లాల్లో సెటిల‌ర్ల ప్ర‌భావం ఉంటుంద‌ని పార్టీ అంచ‌నా వేస్తోంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ కూట‌మిని త‌ర‌పున పోటీ చేసేందుకు సిద్ధం కావ‌డం కూడా అధికార పార్టీని అప్ర‌మ‌త్తం అయ్యేలా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా కూట‌మి త‌ర‌పున సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయాల‌ని భావిస్తోంది. త‌ద్వారా విజ‌యం సులువుగా ఉంటుంద‌న్న అంచ‌నాతో టిటిడిపి నేత‌లున్నారు. ఈ ప‌రిస్థితుల్లో సెటిల‌ర్ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు అధికార పార్టీ నేత‌లు య‌త్నం చేస్తున్నారు.

సెటిల‌ర్ల సంపూర్ణ మ‌ద్ద‌తు పొందుతామ‌న్న ధీమా..!చ‌క్రం తిప్పుతున్న కేటీఆర్..!

సెటిల‌ర్ల సంపూర్ణ మ‌ద్ద‌తు పొందుతామ‌న్న ధీమా..!చ‌క్రం తిప్పుతున్న కేటీఆర్..!

చంద్ర‌బాబు వైఖ‌రిని ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌ట్టే గులాబి పార్టీ రూటు మార్చింది. బాబు రాజ‌కీయం కోసం చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రైన‌వే అన్న సంకేతాలు ఇస్తూ, సీమాంధ్రుల‌కు అండ‌గా తానుంటాన‌ని మంత్రి కేటిఆర్ వ్యాఖ్య‌లు చేయ‌డం పై రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌లు మొద‌లయ్యాయి. సెటిల‌ర్ల‌లో భ‌రోసా క‌ల్పించేందుకు గులాబి పార్టీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. ఎన్నిక‌ల నాటికి సెటిల‌ర్ల మ‌ద్ద‌తు పూర్తి స్థాయిలో త‌మ‌కు ఉంటుద‌న్న ధీమా అధికార పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం టిఆర్ ఎస్ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప‌లువురు నేత‌లు సెటిల‌ర్ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

English summary
The TRS Party has initiated more efforts to reach the andhra sector. The Pink Party, which has been assigned a number of seats in corporates in the Greater elections, is also moving in to support the settlers in the forthcoming elections. The leaders of the trs are expressing their willingness to come to the party with the comments made by Minister KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X