వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ 9 రవిప్రకాశ్ అసలు పేరెంటో తెలుసా ? ఆయన జీవిత చరిత్ర ఏంటో తెలుసుకుందాం ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు మీడియాకు ఓ రేంజ్ క్రియేట్ చేసిన టీవీ 9 రవిప్రకాశ్ అసలు పేరెంటో మీకు తెలుసా ? రవిప్రకాశ్ అని మనందరికీ తెలుసు. ఇక టీవీ 9 చేరడంతో టీవీ 9 రవిప్రకాశ్ అని తెలుసు. ఇంతకీ రవిప్రకాశ్ అసలు పేరెంటో తెలుసుకుందాం పదండి.

వెలిగిపోయాడు ?

వెలిగిపోయాడు ?

రవిప్రకాశ్ కూడా ఒకప్పుడు సాధారణ ఉద్యోగి. సిటికేబుల్ లో రిపోర్టర్ గా ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడినుంచి జీ టీవీలో రిపోర్టర్, సుప్రభాతంలో రిపోర్టర్ గా విధులు నిర్వర్తించారు. తర్వాత జెమినిలో బ్యూరో చీఫ్ గా చేశారు. అక్కడి నుంచి బయటకు రావడంతో ఆయనేంటో ప్రపంచానికి తెలిసింది. టీవీ 9 అనే చానెల్ స్థాపించి టాప్ 1 స్థానంలో నిలిపేందుకు కృషిచేశారు. అంతకుముందు ఉండే మూస పద్ధతిని వీడనాడారు. మీడియా అంటే ఇదీ అని, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. వార్తను అందంగా, హృద్యంగా ప్రజెంట్ చేయడంలో కొత్త పంథా అనుసరించారు. టీవీ 9 స్పూర్తితోనే తెలుగు మీడియాలో కుప్పలు తెప్పలుగా చానెళ్లు ఆవిర్భవించాయి. టీవీ 9ను ఫాలో అయ్యాయనడంలో ఎలాంటి సందేహాం లేదు.

అసలు పేరు ఏంటంటే ?

అసలు పేరు ఏంటంటే ?

టీవీ 9 రవిప్రకాశ్ అసలు పేరు రవిబాబు .. కానీ రవిప్రకాశ్‌గా మనకు సుపరిచితం. ఆయన టీవీలో చేసే ఇంటర్వ్యూలో నేను మీ రవిప్రకాశ్ అని చెప్పడంతో అదే పేరుగా ముద్రపడింది. ఇప్పటికీ కూడా టీవీ 9 రవిప్రకాశ్ అంటేనే అందరికీ గుర్తు. కానీ ఆయన అసలు పేరు రవిబాబు. సర్టిఫికెట్లలో, ఇంట్లో అందరూ అతనిని రవిబాబు అని పిలుస్తుంటారు. వారికి రవిప్రకాశ్ అని పిలిచేందుకు అంతగా ఇష్టపడరు. కానీ రవిప్రకాశ్ మాత్రం .. తనలో ప్రకాశ్ చేరడంతోనే జీవితంలో వెలుగులు నిండాయి. ఎలా వెలుగు నిండిందో అలాగే ప్రభ తగ్గుతోంది.

ఫోర్జరీ కేసుతో మసకబారిన ప్రతిష్ట

ఫోర్జరీ కేసుతో మసకబారిన ప్రతిష్ట

పోర్జరీ కేసుతో ఒక్కసారిగా ఆయనకున్న పేరు పోయింది. టీవీ 9లో ఫోర్జరీకి పాల్పడ్డారని అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేయడంతో ఆయన పేరు మసకబారిపోయింది. ఆ తర్వాత ఆజ్ఞాతంలోకి వెళ్లిపోవడం .. వీడియోలు విడుదల చేయడంతో రవి జీవితంలో చీకటి ఆవహించింది. రవిప్రకాశ్, శివాజీ, మూర్తిలపై అలంద మీడియా ఫిర్యాదు చేసింది. అయితే టీవీ 9 ఫైనాన్సియర్ మూర్తి మాత్రం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శివాజీ, రవిప్రకాశ్ స్పందించలేదు. 160 సీఆర్పీసీ నోటీసులను రెండుసార్లు ఇచ్చారు. అయినా స్పందించకుంటే 41ఏ నోటీసులు ఇచ్చారు.

లుక్ అవుట్ నోటీసులు కూడా ..

లుక్ అవుట్ నోటీసులు కూడా ..

అప్పటికీ రవిప్రకాశ్ నుంచి స్పందన రాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, నౌకల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో మొదటిసారి నోటీసు ఇచ్చాక బెయిల్ కోసం రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేయగా నిరాశే మిగిలింది. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

English summary
Do you know the original name TV 9 Ravi Prakash, who created the range of Telugu media? We all know that Ravi Prakash. The TV 9 was joined and the was known as Ravi Prakash. what is the original name of Ravi Prakash
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X