వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ ప్లాన్: స్పీడ్ తగ్గించి, సీనియర్లతో భేటీలు, వ్యూహత్మక మౌనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Reason for Revanth Reddy's silent రేవంత్ ప్లాన్ అదా ?

హైదరాబాద్: టిడిపిలో ఉన్నంతకాలం దూకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగానే కొంత స్పీడ్‌ను తగ్గించినట్టుగా కన్పిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి తన స్పీడ్‌ను తగ్గించుకోవడానికి వ్యూహమే కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కుదురుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తన స్పీడ్‌ను కొనసాగించే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు.

కొడంగల్ బైపోల్‌కు టిఆర్ఎస్ ప్లాన్, రేవంత్‌పై కెసిఆర్ ప్లాన్ ఇదేకొడంగల్ బైపోల్‌కు టిఆర్ఎస్ ప్లాన్, రేవంత్‌పై కెసిఆర్ ప్లాన్ ఇదే

రేవంత్ రెడ్డి మరో 16 మంది ముఖ్యమైన అనుచరులతో కలిసి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో గత నెల 31వ, తేదిన చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టిడిపిలో ఉన్న సమయంలో వ్యవహరించిన దూకుడును ప్రదర్శించడం లేదు.

రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్‌కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్‌కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!

అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లను రేవంత్ రెడ్డి కలుసుకొంటున్నారు. అందరితో కలిసిపోయే ప్రయత్నిస్తున్న సంకేతాలను రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో కూడ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.

 రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంటయ్యారు

రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంటయ్యారు

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం తన దూకుడుకు బ్రేక్ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలన, కేసీఆర్ వైఖరి పై నిత్యం నిప్పులు చెరిగే ఆయన ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్‌లో ఇమిడేందుకే రేవంత్ వ్యూహాత్మకంగా అడుగుులు వేస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కుదురుకునేంత వరకూ స్పీడ్ తగ్గించుకోవాలని రేవంత్ డిసైడయినట్లు తెలుస్తోంది.

స్పీడ్ కొనసాగితే ఇబ్బందులా

స్పీడ్ కొనసాగితే ఇబ్బందులా

టిడిపిలో ఉన్న సమయంలో కొనసాగించినట్టుగానే స్పీడ్‌ను కొనసాగిస్తే కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయోననే చర్చ సాగుతోంది. ఈ తరుణంలోనే గతంలో మాదిరిగా దూకుడుగా ఇప్పడే వ్యవహరించకూడదనే నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారంటున్నారు.స్పీడ్ తగ్గించడంతో పాటు పార్టీ ముఖ్యులను కలిసి వస్తున్నారు రేవంత్ రెడ్డి.

కొప్పుల రాజుతో రేవంత్ రెడ్డి రాయబారం

కొప్పుల రాజుతో రేవంత్ రెడ్డి రాయబారం

రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా పేరుపడిన కొప్పుల రాజుతో రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో తన చేరికపై పార్టీ నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేయకూడదనే అభిప్రాయంతో రేవంత్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీనియర్లతో రేవంత్ మంతనాలు

సీనియర్లతో రేవంత్ మంతనాలు

ఢిల్లీలో సల్మాన్ ఖుర్షీద్, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ లాంటి ప్రముఖులను కలిసి రాష్ట్రంలో భవిష్యత్ కార్యచరణ‌పై రేవంత్ రెడ్డి చర్చించారని సమాచారం. డిసెంబర్ అయిదున రాహుల్ గాంధీ పట్టాభిషేకం పూర్తవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడిన రోజు కావడంతో ఆ రోజు నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించాలని రేవంత్ భావిస్తున్నారు. గాంధీ భవన్ కు కూడా అదే రోజున రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటున్నారు..

English summary
what is the reason for revanth reddy silent in congress. Revanth reddy planning for future in Congress party, So Revanth Reddy waiting for some days said political analysts said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X