వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం కాలం వ‌చ్చెరా వారీ..! హ‌రిదాసులు కూడా మోడ్ర‌న్ గా మారిపోయే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

హ‌రిదాసులు కూడా మోడ్ర‌న్ గా మారిపోయే..!

హైద‌రాబాద్ : సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంలే ర‌క‌రకాల పిండి వంట‌లు, కోడి పందాలు, రంగురంగుల ప‌తంగిలు ఎగ‌ర‌వేయ‌డం, ఇంటి ముందు పెద్ద పెద్ద రంగ‌వ‌ళ్లులు ఇవ‌న్నీ క‌నువిందు చేస్తుంటాయి. ఇవే కాకుండా నిండుగా అలంక‌రించిన గంగిరెద్దుల తో పాటు హ‌రిదాసులు కూడా సంక్రాంతి పండుగ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్శ‌ణ‌గా నిలుస్తుంటారు. చేతిలో చిరుత‌లు, త‌ల‌మీద అక్ష‌య పాత్ర‌, పంచ‌క‌ట్టు, పొడ‌వైన జందెం, మూడు నామాలతో రామ‌దాసు కీర్త‌న‌లు ఆల‌పిస్తూ ఇళ్ల ముందుకు వ‌చ్చే హ‌రిదాసులు అంద‌రిని ఆక‌ర్శిస్తుంటారు.

హ‌రిదాసుల‌ను చూడ‌గానే స్వ‌చ్చ‌మైన తెలుగు నేల మీద ఉన్నామ‌నే భావ‌న క‌లుగుతుంది. తెలుగు లోగిళ్ల‌లోకి అడుగు పెట్టిన హ‌రిదాసుల‌ను తెలుగు గ్రుహిణులు కాడా సాద‌రాంగా ఆహ్వానిస్తూ వారికి పిండి వంట‌ల‌తో, వ‌స్త్రాల‌తో, ధ‌నం, ధాన్యాల‌తో మ‌ర్యాద చేసి పంపిస్తుండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కాని ఇలాంటి ఆచార వ్య‌వ‌హారాలు పూర్తిగా మారిపోయాయి. ఆదునీక‌త‌ను సంత‌రించ‌కున్న స‌మాజం హ‌రిదాసుల జీవ‌న విధానాన్ని కూడా మార్చేసింది.

what a time..! haridas turned into modern..!!

తెలుగుద‌నం ఉట్టి ప‌డే త‌మ సాంప్ర‌దాయాల‌కు హ‌రిదాసులు తిలోద‌కాలిచ్చిన‌ట్టు తెలుస్తోంది. హావ‌భావాల్లోనే కాకుండా వేష భాష‌ల్లో కూడా ఆధునిక‌త‌ను చూపిస్తున్న హ‌రిదాసుల పోక‌డ‌లు వింత‌గొలుపుతున్నాయి. పాత రోజుల్లో హ‌రిదాసుల‌కు, నేటి త‌రంలో హ‌రిదాసుల‌కు ఇన్న వ్య‌త్యాసం చూసి ఎవ‌రైనా అవాక్క‌వ్వాల్సిందే..!!

హ‌రిదాసులు మోడ్ర‌న్ గా మారి తెలుగువారి ఇళ్ల ముందుకు వ‌చ్చే విధానం ఆశ్య‌ర్యాన్ని క‌లిగిస్తోంది. కాలిన‌డ‌క‌న వ‌చ్చే హరిదాసులు బైక్ పై రావ‌డం, స్వ‌చ్చ‌మైన రామ‌కీర్త‌న‌లు నోటితో ఆల‌పించ‌కుండా, రికార్డుచేసి ఆడియోలో రూపంలో వినిపించ‌డం విచిత్రంగా అనిపిస్తోంది. హ‌రిదాసుల జీవ‌నం కూడా స‌హ‌జ‌త్వానికి భిన్నంగా యాంత్రికంగా మార‌డం ప‌లువురి చేత ఔరా అనిపిస్తోంది. బైక్ పై వ‌చ్చి త‌మ ప‌ని కానిస్తున్న హ‌రిదాసుల వీడియో మీరూ చూడండి..!!

English summary
Haridaa a person who is seen during the festival of Sankranti is now turned into a modern man. Leaving the traditional custom, the modern Haridas comes to various homes on bikes.Earlier Haridas used to sing songs or recite poetry but now the scenario has changed with him playing music on his phone. This turns out to be interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X