వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ తెరపైకి ఎన్టీఆర్ ఓటమి: కెటిఆర్‌పై వంశీచంద్‌ వ్యంగ్యాస్త్రం

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఓటమి అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఓటమి అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ అంశంపైనే కాంగ్రెస్, టిఆర్ఎస్ వర్గాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.మంత్రి కెటిఆర్ కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు.దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కూడ కెటిఆర్‌పై తీవ్రంగానే స్పందించారు.

కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ చరిత్రను ప్రస్తావించారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు అత్యంత తెలివైనవారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒరిజినల్ ఎన్టీఆర్‌ను ఓడించిన చరిత్ర కల్వకుర్తి ప్రజలకు ఉందని వంశీచంద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. డూప్లికేట్ ఎన్టీఆర్ ఓ లెక్కా అంటూ మంత్రి కెటిఆర్‌పై వంశీచంద్‌రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాన్ని ఓసారి తెలుసుకొందాం.

 కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓటమి

కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓటమి

కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్‌కు దక్కింది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్టీఆర్ ఓటమి పాలు కావడం ఆనాడు చరిత్ర.ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 50786 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్‌కు 54,354 ఓట్లు లభించాయి.

 చిత్తరంజన్‌దాస్‌కు మంత్రి పదవి

చిత్తరంజన్‌దాస్‌కు మంత్రి పదవి

ఎన్టీఆర్‌ను ఓడించిన చిత్తరంజన్‌దాస్‌కు జాయింట్ కిల్లర్‌గా పేరొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడ చిత్తరంజన్‌దాస్‌కు మంచి ప్రాధాన్యత లభించింది. అయితే కారణలేమైనా చిత్తరంజన్‌దాస్ కల్వకుర్తి నియోజకవర్గంలో విజయం సాధించలేదు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తరంజన్‌దాస్ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనాడు సంబరాలు చేసుకొన్నాయి. ఈ నియోజకవర్గ ఓటర్లు విలక్షనమైన తీర్పును ఇస్తారు.

 ఎన్టీఆర్ ఓటమికి కారణాలు

ఎన్టీఆర్ ఓటమికి కారణాలు

ఎన్టీఆర్ ఓటమికి అనేక కారణాలున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడతారు. ఆ ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌పై చేసిన దుష్ప్రచారం కారణంగా ఆ ఎన్నికల్లో టిడిపికి తీవ్రంగా నష్టం వాటిల్లిందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.ఈ కారణంగానే ఎన్టీఆర్ ఓటమిపాలయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ స్వచ్చంధ ప్రభావం

జైపాల్‌రెడ్డిది ఇదే నియోజకవర్గం

జైపాల్‌రెడ్డిది ఇదే నియోజకవర్గం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డిది కూడ ఇదే అసెంబ్లీ నియోజకవర్గం.ఈ నియోజకవర్గంలోని మాడ్గుల మండలం జైపాల్‌రెడ్డిది. ఈ నియోజకవర్గం నుండి జైపాల్‌రెడ్డి గతంలో ప్రాతినిథ్యం వహించారు.ఆ తర్వాత నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుండి జైపాల్‌రెడ్డి పోటీచేశారు.

English summary
What was the reason behind NTR defeat in Kalwakurthy Assembly segment in 1989.Even the formidable N.T. Rama Rao suffered a humiliating defeat in Kalwakurthy assembly constituency, one of the two seats he contested.Congress party candidate Chittaranjan das was win against NTR in 1989.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X