హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ బంద్: డిపోలకే పరిమితమైన బస్సులు, అర్ధరాత్రి నుంచే రోడ్డెక్కిన కార్మికులు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రధాన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ తప్పించి మిగతా ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఈ సమ్మెలో పాలు పంచుకుంటున్నాయి.

దీంతో గురువారం అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చిన కార్మిక సంఘాల నేతలు ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రెండేళ్ల బోనస్ చెల్లింపు, కనీస వేతనం పెంపులాంటి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ఎంతమాత్రం సరిపోవని పేర్కొంటూ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఈ బంద్‌లో బ్యాంకుల సిబ్బంది కూడా పాల్గొంటున్న నేపథ్యంలో నేడు అన్ని బ్యాంకుల శాఖలు మూతపడనున్నాయి. విద్యాసంస్ధలు కూడా మూసివేసేందుకు కార్మిక సంఘాల నేతలు యత్నించే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నేటి తెల్లవారుజాముకే ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ డిపోల ముందు కార్మిక సంఘాల నేతలు బైఠాయించారు.

కార్మికులు శుక్రవారం దేశవ్యాప్తంగా చేపట్టనున్న భారత బంద్‌తో బ్యాంకులు, ప్రజా రవాణా, టెలికం వంటి అత్యవసర సేవలకు ఇబ్బంది కలిగే అవకాశముంది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 18 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని 10 కార్మిక సంఘాల నేతలు తెలిపాయి. గతేడాది జరిగిన సమ్మెలో 14కోట్ల మంది పాల్గొన్నట్లు అప్పట్లో కార్మిక సంఘాలు చెప్పుకొన్నాయి.

జెఎన్టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

జెఎన్టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా


భారత్ బంద్ కారణంగా జెఎన్టీయూ పరిధిలోని కళాశాలల్లో శుక్రవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జెఎన్టీయూహెచ్‌ వెల్లడించింది. ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్‌ పరీక్ష 16వ తేదీ మధ్యాహ్నం, రెండో సెమిస్టర్‌ అదేరోజు ఉదయం జరుగుతుంది. మొదటి ఏడాది బీటెక్‌, బీఫార్మసీ పరీక్ష 13న నిర్వహించనున్నారు.

 ఎమర్జెన్సీ సర్వీసులకు సమ్మె మినహాయింపు

ఎమర్జెన్సీ సర్వీసులకు సమ్మె మినహాయింపు


ఎమర్జెన్సీ సర్వీసులకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. 12 డిమాండ్లతో సమ్మెకు దిగుతున్న కార్మికులు ప్రధానంగా కనీస వేతనాలు రూ.18 వేలకు పెంచాలని, అధిక ధరలను నియంత్రించాలని, కనీస పెన్షన్‌ నెలకు రూ.3 వేలు ఇవ్వాలని కోరుతున్నారు.

బెంగాల్‌లో సమ్మెను సాగనివ్వబోమని మమత ప్రకటన

బెంగాల్‌లో సమ్మెను సాగనివ్వబోమని మమత ప్రకటన


ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సమ్మెను సాగనివ్వబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజా జీవితాన్ని స్తంభింపజేసేందుకు ప్రయత్నించే వారు దుకాణాలు, వాహనాలకు నష్టం కల్పిస్తే పరిహారం వసూలు చేస్తామని ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేశారు.

వామపక్షాల మద్దతు

వామపక్షాల మద్దతు


శుక్రవారం జరగనున్న అఖిల భారత సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. సిపిఐ, సిపిఎం పార్టీలు సమ్మెను విజయవంతం చేయాలని, ప్రజాసంఘాలతో కలసి ఎఐటియుసి, సిఐటియు వాటి అనుబంధ సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొంటాయని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం


నిత్యావసర సర్వీసులు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వం సంబంధిత విభాగాలన్నిటినీ అప్రమత్తం చేసింది. బ్యాంకులు, ప్రజా రవాణాలాంటి నిత్యావసర సర్వీసులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిపోలకే పరిమితమైన బస్సులు

డిపోలకే పరిమితమైన బస్సులు

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బంద్ ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 3500 బస్సులు నిలిచిపోయాయి. డిపోల ముందు కార్మికుల నిరసనను తెలియజేస్తున్నారు. విజయవాడ, హైదరాబద్ రూట్ లో తిరుగుతున్న 20 బస్సుల సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 35 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.

ఖమ్మం జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు 9 డిపోలకే పరిమితమయ్యాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. రామంగుండం, సింగరేణిలో సమ్మె ప్రభావంగా బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

 బెజవాడలో సమ్మె ప్రభావం పాక్షికమే

బెజవాడలో సమ్మె ప్రభావం పాక్షికమే

సార్వత్రిక సమ్మె ప్రభావం విజయవాడలో మాత్రం అంతగా కనిపించడం లేదు. సార్వత్రిక సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీలోని కార్మిక సంఘం ఎంప్లాయీస్ యూనియన్‌తో పాటు కార్మిక పరిషత్ మాత్రమే మద్దతు పలికాయి. మెజారిటీ కార్మికులతో ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రం సమ్మెకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ఎంయూకు చెందిన కార్మికులు శుక్రవారం ఉదయం యధావిధిగా విధులకు హాజరయ్యారు. దీంతో నగరంలో ఆర్టీసీ బస్సులు రోజు మాదిరే రోడ్డెక్కాయి. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాల తలుపులు తెరచుకున్నాయి.

 విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణిల్లో నిలిచిపోయిన ఉత్పత్తి

విశాఖ స్టీల్ ప్లాంట్, సింగరేణిల్లో నిలిచిపోయిన ఉత్పత్తి

ఏపీలోని విశాఖలోని స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీ, పోర్టులకు చెందిన కార్మికులంతా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్, బీహెచ్ పీవీల్లో ఉత్పత్తి నిలిచిపోగా, పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు బొగ్గు ఉత్పత్తిలో దేశంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన సింగరేణి కాలరీస్ కు కూడా సమ్మె దెబ్బ తగిలింది. సింగరేణిలోని భూపాలపల్లి డివిజన్ కు చెందిన 4 వేల మంది కార్మికులు సమ్మెకు జైకొట్టారు. వెరసి అక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

English summary
More than a million workers in banking, telecom and other sectors are joining the 'Bharat Bandh' today to press their demand for better pay and in protest against new labour and investment policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X