• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంతా తలకిందులు.. అంచనాలకు అందని సీఎం కేసీఆర్ వ్యూహం... అంతుచిక్కని అంతరంగం..

|

హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆదివారం(ఫిబ్రవరి 8) జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో 'బిగ్ అనౌన్స్‌మెంట్' ఉండబోతుందని చాలామంది భావించారు. అటు మీడియా,ఇటు జనం నిన్నటి సమావేశం పట్ల చాలా ఉత్సుకత ప్రదర్శించారు. గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేటీఆర్ పట్టాభిషేకాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని... ఈ ఆదివారం బిగ్ డేగా మారబోతుందని పలు మీడియా సంస్థల్లో కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆ ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ ఎవరి అంచనాలకు అందని రీతిలో అందుకు విరుద్దమైన ప్రకటన చేశారు. పైగా గీత దాటితే బండకేసి కొడుతానంటూ కన్నెర్ర చేశారు. అయితే ఈ ప్రకటన వ్యూహాత్మకమేనా.. అసలాయన అంతరంగంలో ఏమున్నది.. ఇవే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అంతా తలకిందులు....

అంతా తలకిందులు....

మంత్రి కేటీఆర్‌ త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారని... అయితే తప్పేంటని... ఆయన అన్ని విధాలా సీఎం పదవికి అర్హుడని... ఇలా మంత్రులు,ఎమ్మెల్యేలు గత కొద్దిరోజులుగా అనూహ్య వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఓ కార్యక్రమంలో కేటీఆర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అడ్వాన్స్ కంగ్రాట్స్ కూడా చెప్పారు. ఈ మాటలు విని కేటీఆర్ ముసిముసిగా నవ్వారు తప్పితే ఎక్కడా ఖండించలేదు. దీంతో కేటీఆర్ సీఎం కాబోతున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని కేసీఆరే అధికారికంగా ప్రకటించబోతున్నారని... అందుకోసమే సమావేశాన్ని ఏర్పాటు చేశారన్న చర్చ జరిగింది. కానీ ఇంతలోనే అంతా తలకిందులైపోయింది.

వ్యూహాత్మకమేనా...?

వ్యూహాత్మకమేనా...?

టీఆర్ఎస్‌లో కేసీఆర్‌కు తెలియకుండా చీమ చిటుక్కుమంటుందా... కేసీఆర్ కనుసన్నులను దాటి ఏ పరిణామాలైనా చోటు చేసుకుంటాయా... నిన్నటి సమావేశం తర్వాత ఇప్పుడివే ప్రశ్నలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవేళ కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశమే గనుక కేసీఆర్‌కు లేకపోతే... చాలాకాలంగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని కేసీఆర్ ఎందుకు ఉపేక్షించారు. ఇంత పెద్ద చర్చకు ఎందుకు అవకాశం కల్పించారు. ఆ ప్రచారాన్ని,చర్చను మొగ్గలోనే తుంచివేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు... ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే కనిపిస్తున్నప్పటికీ... ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనన్న చర్చ కూడా జరుగుతోంది. కావాలనే ఈ చర్చకు ఊతమిచ్చి... లీకుల పట్ల మౌనం వహించి.. తీరా ఇప్పుడు మరో పదేళ్లు నేనే సీఎం అని కేసీఆర్ ప్రకటించడం వెనుక కచ్చితంగా ఏదో వ్యూహం దాగుందనే వాదన వినిపిస్తోంది.

  Telangana to have its own brand of meat soon
  కేసీఆర్ అంతరంగంలో ఏమున్నది?

  కేసీఆర్ అంతరంగంలో ఏమున్నది?

  కేసీఆరే చెప్పినట్లు కొన్ని నిర్ణయాలు అనూహ్యంగా ఉండొచ్చు. కొన్నిసార్లు అన్ని విషయాలు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం కుదరకపోవచ్చు. ఉదాహరణకు 2018లో అసెంబ్లీ రద్దు అని ఆయనే స్వయంగా చెప్పారు. ఇదే సమావేశంలో సీఎం మార్పుకు సంబంధించి ఏదైనా ఉంటే మీ అందరితో చర్చించి ఎలాంటి దాపరికం లేకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్తే తప్ప సీఎం కుర్చీ నుంచి తప్పుకునేది లేదని తాజా సమావేశంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ అంతరంగంలో ఏమున్నది... ఏ వ్యూహంతో ఆయన ముందుకు కదులుతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కేటీఆర్ పట్టాభిషేకం ఇక ఆగిపోయినట్లేనా... లేక అనూహ్య నిర్ణయం ఎప్పుడైనా ఉండొచ్చా... అన్నది వేచి చూడాల్సిందే.

  English summary
  Amid buzz around KT Rama Rao as chief minister, Telangana Rashtra Samithi president and chief minister K Chandrasekhar Rao on Sunday warned the party leaders against making statements in public on the change of guard in the party and the state.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X