వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ‌జ్వేల్ లో ఏం జ‌రుగుతోంది..! కేసీఆర్ ప్ర‌త్య ర్థిపై ఎందుకంత క‌క్ష్య సాధింపు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఆపద్దర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రత్యర్ధిని పోలీసులు ముప్పతిప్పలు పెడుతున్నారు. కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాఫ్రంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఒంటేరు ప్రతాపరెడ్డికి గడిచిన నాలుగు రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం చుక్కలు చూపిస్తోంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు పోలీసులు. ఒక దశలో పోలీసు వేధింపులు తట్టుకోలేక ప్రతాపరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కూడా ఒడిగట్టారు. ఇదంతా ఎందుకు జ‌రుగుతోంది..? ఇంత జ‌రుగుతున్నా కాంగ్రెస్ పార్టీ స్పంద‌న అంతంత‌మాత్ర‌మే ఎందుకుంది..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

వంటేరు ప్ర‌తాత్ రెడ్డిపై వేధింపులు..! నోరుమెద‌ప‌ని కాంగ్రెస్ నేత‌లు..!!

వంటేరు ప్ర‌తాత్ రెడ్డిపై వేధింపులు..! నోరుమెద‌ప‌ని కాంగ్రెస్ నేత‌లు..!!

ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా తెలంగాణ‌లో చిత్ర విచిత్ర ప‌రిణామ‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌త్య‌ర్థుల ప‌ట్ల స్పూర్తి దాయ‌క పోటీకి తీలోద‌కాలు ఒదిలి బౌతిక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు నాయ‌కులు. ఏకంగా ముఖ్య‌మంత్రి ఇలాకాలో ఇటువంటి ప‌రిణామ‌లు చోటుచేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. సోదాల పేరుతో ఆక‌స్మికంగా ఇంట్లోకి చొర‌బ‌డ‌టం, వేదించ‌డం రాజ‌కీయాల్లో కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. గ‌జ్వేల్ లో ప్ర‌జా కూట‌మి అభ్య‌ర్థి వంటేరు ప్ర‌తాప్ రెడ్డి పైన అదికార గులాబీ పార్టీ కావాల‌నే క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌మ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాద‌యి. ఇంతలా పోలీసులు ప్రతాపరెడ్డి వెంట పడ్డా రాష్ట్రంలో ఒక్క సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా ఆయనకు సంఘీభావం తెలపడానికి గజ్వేల్ రావడం లేదు. ఏదో టీపీసీసీ అధ్యక్షుడు మాత్రం గాంధీ భవన్ వేదికగా కొంచెం గట్టిగా ప్రభుత్వాని, పోలీసు యంత్రాంగాన్ని హెచ్చరించారు తప్పితే మిగిలిన నాయకులెవ్వరూ నోరు మొదపడం లేదు.

కేసీఆర్ ఎత్తుల‌కు కాంగ్రెస్ పై ఎత్తులు..! అందుకే టీపీసిసి సైలెంట్..!

కేసీఆర్ ఎత్తుల‌కు కాంగ్రెస్ పై ఎత్తులు..! అందుకే టీపీసిసి సైలెంట్..!

అయితే ప్రతాపరెడ్డిపై జరుగుతున్న వేధింపుల విషయంలో కాంగ్రెస్ ముఖ్యలెవ్వరూ స్పందించకపోవడానికి వెనుక పెద్ద కారణమే ఉందని సమాచారం. వాస్తవానికి ప్రతాపరెడ్డిపై అంతలా ఒత్తిడి పెట్టవల్సిన అవసరం పోలీసులకు లేదు... కేసీఆర్ కూడా లేదు. కానీ అనునిత్యం పోలీసులు ఏదో ఒక సాకు చూపించి ప్రతాపరెడ్డిని వెంటాడటం వెనుక కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఈ సంఘటనతో కాంగ్రెస్ సీనియర్లు ఆవేశపడిపోయి గజ్వేల్ కేంద్రంగా నిరసనలు, ఆందోళనలతో బిజీ అయిపోతే మిగిలిన నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులైనా గ్రౌండ్ క్లియర్ గా ఉంటుందని... దాంతో కాంగ్రెస్ హేమాహేమీలు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో రాజకీయం ఉల్టాపల్టా చేయవచ్చనే ఆలోచనతోనే ప్రతాపరెడ్డిపై పడ్డారని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.

సంయ‌మ‌నం పాటిస్తున్న నాయ‌కులు..! వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం..!!

సంయ‌మ‌నం పాటిస్తున్న నాయ‌కులు..! వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం..!!

మొత్తం నాయకులందరూ ప్రతాపరెడ్డి ఇష్యూలో ఎంగేజ్ అయి ఉంటే చాలా నియోజకవర్గాల్లో ఒకట్రెండు రోజులైనా కాంగ్రెస్ ప్రచారం అడ్డుకున్నట్లు ఉంటుందని ఆ కారణంగానే ప్రతాపరెడ్డిపై కనీవినీ ఎరుగని ఒత్తడి పెంచుతున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే ప్రతాపరెడ్డి విషయంలో గతంలోలా ఎవరూ ఛలో గజ్వేల్ అనడం లేదని సమాచారం. తామంతా గజ్వేల్ వెళితే మమ్మల్ని కూడా అరెస్ట్ చేయించి ఒకట్రెండు రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టినా కూర్చోపెడతారని కాంగ్రెస్ ముఖ్య నేతలు అనుమానిస్తున్నారు.

ప్ర‌తాప్ రెడ్డిని పావుగా వాడుకోవాల‌ని చూస్తున్న గులాబీ పార్టీ..! ట్రాప్ లో ప‌డొద్ద‌నుకుంటున్న కాంగ్రెస్..!

ప్ర‌తాప్ రెడ్డిని పావుగా వాడుకోవాల‌ని చూస్తున్న గులాబీ పార్టీ..! ట్రాప్ లో ప‌డొద్ద‌నుకుంటున్న కాంగ్రెస్..!

ఈ అంచనాలతోనే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి లాంటి నేతలు కూడా ఈ విషయంపై బహిరంగంగా పెద్దగా స్పందించడం లేదు అయితే ఎప్పటికప్పుడు ప్రతాపరెడ్డితో ఫోన్లో టచ్ లో ఉండి నైతిక మద్దతు అయితే తెలుపుతున్నట్లు సమాచారం. మొత్తం మీద ఎన్నికల సమయంలో పోలింగ్ కు ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉన్నందున కేసీఆర్ విసిరే రాజకీయ ఉచ్చులో పడకుండా కాంగ్రెస నేతలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

English summary
The political opponent of the KCR is thrown by the police.The District Police Department has shown dice for the past four days as the party's candidate in the praja front contesting as candidate. The police are trying to get him to where he is and where the brothers are being harassed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X