• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వ్యభిచారం రూట్ మారింది.. కోరుకున్న అమ్మాయిలు ఈజీగా.. మందుబాబులేమీ తక్కువ కాదుగా..!

|

హైదరాబాద్ : తాడిని తన్నేవాడుంటే దాన్ని తలదన్నేవాడుంటాడు అనేది సామెత. అసాంఘిక కార్యకలాపాలకు, నేర నియంత్రణకు పోలీసులు అందివచ్చిన టెక్నాలజీ వాడేస్తుంటే.. అక్రమార్కులు సైతం తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. టెక్నాలజీ వాడకంలో తాము కూడా సై అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వ్యభిచార ముఠాలు నిర్వహించే బ్రోకర్లు వాట్సాప్ ద్వారా యధేచ్ఛగా దందా నిర్వహిస్తున్న ఉదంతాలు ఇటీవల బయటపడుతూనే ఉన్నాయి. అదే క్రమంలో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అంది పుచ్చుకుని డ్రంకెన్ డ్రైవ్‌ల బారి నుంచి తప్పించుకునేలా మందుబాబులు వేస్తున్న స్కెచ్చులు కూడా ఔరా అనిపిస్తున్నాయి.

సోషల్ మీడియా ద్వారా విటులకు వల..!

సోషల్ మీడియా ద్వారా విటులకు వల..!

పెరిగిన టెక్నాలజీని వాడేస్తూ సెక్స్ రాకెట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. విటులకు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు. ఆ క్రమంలో వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలతో పాటు రేటు కూడా పంపిస్తున్నారు. దాంతో విటులు వాట్సాప్‌లోనే అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. మూడో కంటికి తెలియకుండా బ్రోకర్, విటుల మధ్య సాగే వాట్సాప్ సంభాషణ అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. దాంతో పోలీసులకు చిక్కకుండా తమ పని కానిచ్చేస్తున్నారు.

ఆగస్టు చివరి వారంలో విశాఖపట్నంలొ ఓ హోటల్‌లో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ బాగోతం సోషల్ మీడియాను ఎలా వాడేస్తున్నారో తెలపడానికి నిదర్శనంలా మారింది. హోటల్ గదుల బుకింగ్ నుంచి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకునే వరకు అంతా ఆన్‌లైన్‌ వ్యవహారమే నడిపించారు బ్రోకర్లు. చివరకు విషయం కాస్తా బయటకు పొక్కడంతో సీన్ రివర్సైంది. పోలీసుల ఎంట్రీతో సెక్స్ రాకెట్ బాగోతం బయటపడింది.

రెండో భర్తతో కలిసి.. ఆస్తి కోసం భర్తను, బంధువులను చంపి..! 17 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ

వాట్సాప్ ద్వారా సెక్స్ రాకెట్.. 9 మంది యువతులు అరెస్ట్

వాట్సాప్ ద్వారా సెక్స్ రాకెట్.. 9 మంది యువతులు అరెస్ట్

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో స్పా (మసాజ్ సెంటర్) ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. వాట్సాప్ వేదికగా అమ్మాయిల ఫోటోలు షేర్ చేస్తూ విటులను ఆకర్షిస్తున్న సెక్స్ రాకెట్ బండారం వెలుగు చూసింది. ఒక మహిళ ప్రధాన సూత్రధారిగా సాగుతున్న ఈ తతంగం చివరకు పోలీసుల కంట పడింది.

ఘజియాబాద్‌లో స్పా సెంటర్లు సెక్స్ వర్కర్లకు అడ్డాగా మారాయి. అందులో వ్యభిచారం యధేచ్ఛగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు అటాక్ చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు పట్టుబడటం గమనార్హం. విటులు, నిర్వాహకులు అంతా కలిపి మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్న మహిళ కేవలం వాట్సాప్ ద్వారా ఈ దందా సాగిస్తుండటం పోలీసులను విస్మయానికి గురి చేసింది. గుట్టు చప్పుడు కాకుండా.. మూడో కంటికి తెలియకుండా ఇలా వాట్సాప్‌ను వాడుకున్నట్లు దర్యాప్తులో అంగీకరించారు నిర్వాహకులు.

డ్రంకెన్ డ్రైవ్‌ల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్‌లు

డ్రంకెన్ డ్రైవ్‌ల నుంచి తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్‌లు

అదలావుంటే హైదరాబాద్‌లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ బారి నుంచి తప్పించుకోవడానికి ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు మందుబాబులు. మందు తాగాక తాము ఇళ్లకు వెళ్లే క్రమంలో ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్ చూస్తే చాలు.. ఏయే ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్‌లు కొనసాగుతున్నాయనే సమాచారం అందులో కనిపిస్తుంది. దాంతో ఆ రూట్లో కాకుండా మరో మార్గంతో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి ఇప్పటికే చాలా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ అయినట్లు పోలీసుల ద‌ృష్టికి రావడం గమనార్హం.

ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!

కరీంనగర్‌లో మరింత అడ్వాన్స్.. ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాలంటే 2 వేలు..!

కరీంనగర్‌లో మరింత అడ్వాన్స్.. ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాలంటే 2 వేలు..!

ఇక కరీంనగర్‌లో మందుబాబులు మరింత అడ్వాన్స్‌గా ఉన్నారు. పోయిన సంవత్సరమే అక్కడ వాట్సాప్ గ్రూపుల లీలలు బయటపడ్డాయి. మందుబాబులు కలిసి క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూపుల తాలూకు బండారం గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆ వాట్సాప్ గ్రూపులో చేరాలంటే ఒక్కో సభ్యుడు రెండు వేల రూపాయలు చెల్లించాలనే నిబంధన కూడా పెట్టారట అడ్మిన్లు. అంతేకాదు కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఆ గ్రూపుల్లో కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించిన సమాచారం మాత్రమే పోస్టులు పెట్టాలి. గుడ్ మార్నింగులు, తొక్క తోలు అంటూ అనవసర పోస్టులు పెడితే రెండు వందల రూపాయల ఫైన్ కూడా విధిస్తారట. ఒకవేళ ఆ ఫైన్ చెల్లించని పక్షంలో సదరు గ్రూప్ సభ్యులను ఎలిమినేట్ చేస్తారట. చూశారా టెక్నాలజీని ఎలా వాడేస్తున్నారో.. కలికాలం మరి..!

English summary
Sex Rocket Brokers Using Whatsapp for their business. They will taking precautions to escape from police, thats why they mostly using whatsapp. Recently, drunkers also using whatsapp for drunken drive information in various routes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X