• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిన్నారులపై అకృత్యాలు ఆగవా .. మృగాళ్ళుగా మారుతున్న మగాళ్ళకు కఠిన శిక్షలు ఇంకెన్నడు ?

|

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. కారణం మన అత్యాచార భారతం .. నాగరికతకి నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటంలేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆడుకునేందుకు రంగులు కొనిస్తానని, మామిడి పండిస్తానని పిలిచి ఒకడు ,అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారిని ఒకడు ఇలా పసిమొగ్గల బతుకులను చిదిమేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.

  మత్తు మందు చల్లి ... చోరీకి పాల్పడ్డ దుండగులు
  మామిడిపండు ఆశ చూపి ఐదేళ్ళ చిన్నారిని అత్యాచారం చెయ్యబోయిన వృద్ధుడు

  మామిడిపండు ఆశ చూపి ఐదేళ్ళ చిన్నారిని అత్యాచారం చెయ్యబోయిన వృద్ధుడు

  ఇక మరో ఘటన సైతం ఆందోళన కలిగిస్తుంది. జగద్గిరిగుట్ట రిక్షాపుల్లర్స్‌ కాలనీకి చెందిన ఎల్లయ్య అనే 60 ఏళ్ళ వృద్ధుడు తన ఇంటి సమీపంలో ఉండే ఐదేళ్ల చిన్నారిని మామిడి పండు ఇప్పిస్తానని మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. దీంతో చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి ఆమెను రక్షించారు . బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ఎల్లయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

  ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

  ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి చేసిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి

  ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి చేసిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి

  ఇక డోన్ పట్టణంలో 70 ఏళ్ల వృధ్దుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచార యత్నం చేశాడు. డోన్ లోని రైల్వే త్రివర్ణ కాలనీలో రాందాస్ అనే 70 ఏళ్ళ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 7, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలికలపై గత రెండు రోజులుగా అత్యచారం చేస్తున్నాడు. కొత్తగా నిర్మిస్తున్న రైల్వే క్వార్టర్స్ భవనంలోకి బాలికలను తీసుకువెళ్ళి ఈ దారుణానికి ఒడిగడుతున్నాడు. ఇక శనివారం నాడు కూడా బాలికలను రైల్వేకార్టర్సు నూతన భవనంలోకి తీసుకు వెళ్ళి అత్యాచారం చేస్తుండగా చిన్నారులు భయంతో కేకలు వేశారు. చిన్నారుల అరుపులు విన్న స్ధానికులు అక్కడకు చేరుకున్నారు. బాలికలు చెప్పిన సమాచారంతో ..అత్యాచారయత్నం చేసిన రాందాస్ కు దేహశుధ్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  చట్టాలు చట్టుబండలేనా .. ఈ అత్యాచారాలు ఇలా కొనసాగాల్సిందేనా

  చట్టాలు చట్టుబండలేనా .. ఈ అత్యాచారాలు ఇలా కొనసాగాల్సిందేనా

  బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. బుద్ధుడు పుట్టిన పుణ్యభూమిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, మనుషుల్లో రోజురోజుకీ పెరుగుతున్న పశు ప్రవృత్తిని తేటతెల్లం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న అత్యంత పాశవికంగా తొమ్మిది నెలల పసి కందును చిత్రహింసలకు గురి చేసి రేప్ చేసిన ఉదంతం మరిచిపోకముందే, అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను కామాంధులు చిదిమేస్తున్న సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. ఇక రోజు రోజుకీ పెరుగుతున్న మృగాళ్ళ ఘాతుకాలతో మన దేశం ఎటువైపు పయనిస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇది మన అత్యాచార భారతం అని చెప్పాల్సిన దుస్థితి.

  ఇక ఈ పరిస్థితులు మారాలంటే ముందు ఇలాంటి ఘాతుకాలు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు తక్షణం అమలయ్యేలా చూడాలి. నేరం జరిగిన కొన్నేళ్ళకు శిక్ష వేసే పద్దతికి స్వస్తి చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సత్వర శిక్షలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Girls cries have not stopped in India, as it is changed as civilization, The rape of girls continues. One who buys chocolate, one calls for buying holy colours, one calls for giving... mangoes, one nine-year-old child .. who is not most of the girls are sexually harrased in india every day . The country is burning with severe problem . No matter how many laws such as Nirbhaya, but girls' care remains questionable.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more