హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్ స్టోరీ: ద్రావిడ్‌తోనే ఉండిపోతానని హైదరాబాద్ యువతి బెట్టు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ముంబై: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఇటు మైదానంలో, అటు బయట ఎంత మృదువుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తన ఆటతో పాటు తన ప్రవర్తనతో పాటు ఎంతోమందిని అతను ఆకట్టుకున్నాడు. నేటి యువ క్రికెటర్లకు ద్రావిడ్ ఎంతో ఆదర్శం.

క్రమశిక్షణలో రాహుల్ ద్రావిడ్‌ను చూసి నేర్చుకోవాలని నేటి తరం క్రికెటర్లకు చాలామంది చెబుతుంటారు. ఆటతో పాటు క్రమశిక్షణకు మారుపేరైన రాహుల్ ద్రావిడ్‌ను అభిమానించే వారు ఎంతోమంది ఉంటారు. అందులో యువకులతో పాటు యవతులు కూడా ఉంటారు.

ద్రావిడ్ అమాయక చూపులకు చాలామంది యువతులు కూడా పడిపోయి ఉంటారు! ద్రావిడ్‌ను చూస్తే చాలామంది అమ్మాయిలు పడిపోయినా... హైదరాబాదుకు చెందిన ఓ అమ్మాయి తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఓ యువతి ద్రావిడ్ ఇంటి నుంచి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్ట పడటం లేదు.

125 పరుగులతో సత్తా చాటిన ద్రావిడ్ తనయుడు

ఇటీవలి క్రికెట్ హ్యూమరిస్ట్ విక్రమ్ సాథయే షో 'వాట్ ది డక్'లో రాహుల్ ద్రావిడ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. హైదరాబాదుకు చెందిన తన మహిళా అభిమాని గురించి ద్రావిడ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. సదరు హైదరాబాద్ మహిళా అభిమాని తన ఇంటి నుంచి వెళ్లేందుకు ఎంతకూ నిరాకరించిందని చెప్పాడు.

ఆ షోలో విక్రమ్ సాథయే మాట్లాడుతూ.. 'ప్రతి తల్లి కూడా నీలాంటి అల్లుడు కావాలనుకుంటుంది. చాలామంది నీలాంటి భర్త కావాలనుకుంటారు. నీకు అమ్మాయిల ఫాలోయింగా చాలా ఉందని నీ సహ ఆటగాళ్లు చెప్పారు. ఈ విషయంలో ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా?' అని ప్రశ్నించాడు.

దానికి రాహుల్ ద్రావిడ్ సమాధానం ఇచ్చాడు. 'ఓ సుదీర్ఘ పర్యటన నుంచి తిరిగి వచ్చాను. ఇంటికి వెళ్లాక నిద్రపోయాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే నిద్రించాను. నేను సాయంత్రానికి నిద్ర లేచాను. అప్పుడు నా వద్దకు మా అమ్మ వచ్చారు. నీ కోసం ఓ అభిమాని నిరీక్షిస్తున్నారని అమ్మ చెప్పారు.

 Rahul Dravid

హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ యువతి అప్పటికే గంట పాటు నా కోసం నిరీక్షించారు. మా అమ్మ తనకు టీ, కాఫీ ఇచ్చారు ఆమె గదిలో నా కోసం వేచి చూస్తున్నారు. అమ్మ తనకు ఆ విషయం చెప్పిన తర్వాత తాను నేరుగా ఆ అభిమాని వద్దకు వెళ్లి, అందరికి ఇచ్చినట్లే ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ ఇచ్చాను. ఎలా ఉన్నారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? గ్రేట్ అన్నాను.'

ఆమెతో ఓ ఫోటో కూడా దిగానని ద్రావిడ్ తన ఆసక్తికరమైన కథను కొనసాగించారు. అయితే, ఆ తర్వాత ఆ యువతి చెప్పిన విషయం విని షాకయ్యానని ద్రావిడ్ అన్నారు.

తన (ద్రావిడ్) కోసమే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి వచ్చినట్లు చెప్పారని, నాతోనే ఉంటానని ఆమె పట్టుబట్టారని చెప్పారు. దాంతో తాను.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించానని, అసలు మీ తల్లిదండ్రులు ఎక్కడ అని అడిగానని ద్రావిడ్ చెప్పారు. ఆ సమయంలో తాను అప్ సెట్ అయ్యానన్నారు. అయితే, ఆ తర్వాత ఆ కథ బాగానే ముగిసిందని ద్రావిడ్ చెప్పాడు.

English summary
Former India skipper Rahul Dravid was quite a chick magnet during his heydays. The Indore-born cricketer’s mannerisms both on and off the field served as inspiration for many young players across the globe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X