• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు 11సార్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాట‌వ‌న్న‌కేసీఆర్..!

|

మిర్యాలగూడ/హైద‌రాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు కూడా 100 సీట్లు కూడా దాటవు అన్నారు. ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే దేశాన్ని శాసించబోతున్నాయి. తాను యూపీఏ కేబినెట్లో ఉన్నప్పుడు 11 సర్జికల్ దాడులు జరిగాయి. సర్జికల్ దాడులు ఎప్పుడూ జరిగేవే. ఆ ఫోటోలు చూపించి ఓట్లు అడుక్కుంటారా అని ప్రశ్నించారు. పొద్దున లేస్తే దేవుడు, హిందువులు అని ప్రచారం చేస్తారు. బీజేపీ నాయకులు దొంగ హిందువులు అని, ఓట్ల కోసం హిందూత్వ వాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు బీజేపి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

 ఎన్నికల తెల్లారి బీజేపీ గతి శంకరగిరి మాన్యాలే..! తీవ్రంగా విమ‌ర్శించిన కేసీఆర్..!!

ఎన్నికల తెల్లారి బీజేపీ గతి శంకరగిరి మాన్యాలే..! తీవ్రంగా విమ‌ర్శించిన కేసీఆర్..!!

ఎన్నికల తెల్లారి బీజేపీ గతి శంకరగిరి మాన్యాలే. ఎవరి భరతం ఎవరు పడతారో చూసుకుందాం. బీజేపీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆ పార్టీకి కాలం చెల్లిపోయింది. దేశంలో ఇంత గోల్మాల్ ప్రధాని లేడు. దేశ ప్రధానే పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా. బీజేపీ మాట్లాడే మాటలకు అర్ధముందా. బీజేపీ 118 సీట్లకు పోటీ చేస్తే గెలిచింది ఒక్కసీటు. 103 సీట్లలో డిపాజిట్ రాలేదు. బీజేపీ మాటలు వింటుంటే చక్కెరొచ్చి కింద పడతం. నరేంద్ర మోదీ మనల్ని చూసే నకలు కొట్టి ఆయుష్మాన్ భవ పెట్టిండు. ఆయుష్మాన్ భవ తీసుకోం అని మోదీ ముందే చెప్పిన. మన ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భవ కంటే గొప్పది. దమ్ముంటే ఆయుష్మాన్ భవ - ఆరోగ్యశ్రీపై చర్చపెడదాం. వట్టిమాటలు.. గోల్ మాల్.. గందరగోళం. మోదీ మాట్లాడితే డబ్బాలో గులకరాళ్లేసి ఊపినట్టే. బీసీలు, దళితుల కోసం బీజేపీ ఏమైనా చేసిందా. ఛాయ్ వాలా పోయి, చౌకీదార్ వచ్చాడు. బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టమని అడిగితే మోదీ పెట్టలేదని చంద్ర‌శేఖ‌ర్ రావు ద్వ‌జ‌మెత్తారు.

 సర్జికల్ ఫొటోలు చూపించి ఓట్లడుగుతారా..! బీజేపికి సిగ్గుండాల‌న్న కేసీఆర్..!!

సర్జికల్ ఫొటోలు చూపించి ఓట్లడుగుతారా..! బీజేపికి సిగ్గుండాల‌న్న కేసీఆర్..!!

దామచర్ల ప్లాంటుని మూసేస్తామని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి అంటే, జనం ఆయన్నే శాశ్వతంగా మూసేసిండ్రు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటా అని సీపీఐ నారాయణ అన్నడు. కౌంటింగ్ రోజు కనిపించకు అని నారాయణతో చెప్పిన. టీఆర్ఎస్ గెలిస్తే కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం చేస్తా అన్నడు. గడ్డం తీయను అని ఉత్తమ్ కుమార్ అన్నడు. ఉత్తమ్ గడ్డం తీస్తే మాకేంటి తీయకుంటే మాకేంటి. గడ్డం తీయకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డే గుడ్డేలుగు అయితడు. ఉత్తమ్ నీచమైన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని చంద్ర‌శేఖ‌ర్ రావు మండిప‌డ్డారు.

లోకసభ ఎన్నికలు 2019: జోరుగా టీఆర్ఎస్ నేతల ప్రచారం

 బీజేపీకి 150, కాంగ్రెస్ కు 100 సీట్లక‌న్నా ఎక్కువ‌రావు..! జోష్యం చెప్పిన కేసీఆర్..!!

బీజేపీకి 150, కాంగ్రెస్ కు 100 సీట్లక‌న్నా ఎక్కువ‌రావు..! జోష్యం చెప్పిన కేసీఆర్..!!

సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే నర్సింహారెడ్డి గెలుపు ఖాయమని అర్ధమవుతోంది. నల్లగొండ చైతన్యం ఉన్న జిల్లా. ఎర్రజెండాలు ఎత్తుకున్న పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లా. ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఎలక్షన్లలో గెలవాల్సింది పార్టీలు కాదు ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కోట్లమందిని కలుపుని ఉద్యమం చేసినం. అనేక ఒడిదొడుకుల మధ్య ప్రయాణం ప్రారంభించాం. ఈ నాలుగున్నరేళ్లలో సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలబడ్డాం. ఆర్ధిక ప్రగతిలో నెంబర్వన్, 24 గంటల కరెంటులో నెంబర్ వన్. సోలార్ విద్యుత్లో నెంబర్-2. ఆంధ్రా పాలనలో ఇంతకాలం బందీలుగా ఉన్నం.. ఇప్పుడు స్వతంత్రులం. నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజీ తోడైనా సరే మీ పంటలకు నీళ్లిస్తం. హుజూర్ నగర్ లిఫ్ట్, మిర్యాలగూడ లిఫ్టు పూర్తిచేసి చివరి ఆయకట్టుకు కూడా నీరందిస్తామ‌న్నారు.

 లోక్ స‌భ‌లో ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలుస్తాం..! ధీమా వ్య‌క్తం చేసిన కేసీఆర్..!!

లోక్ స‌భ‌లో ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలుస్తాం..! ధీమా వ్య‌క్తం చేసిన కేసీఆర్..!!

ఎన్నికల తర్వాత అన్ని జిల్లాల్లో మూడు నాలుగు రోజులపాటు పర్యటిస్తా. నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు వచ్చాయి. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 750 పడకల ఆసుపత్రి. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. సుఖేందర్ రెడ్డికి టికెట్ ఇస్తామంటే ఆయనే వద్దన్నాడు. సుఖేందర్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయబోతున్నాడు. ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ పదవి ఊడిపోతది. వేమిరెడ్డి నరసింహారెడ్డి లోక్సభలో కూర్చోబోతున్నాడు. ట్రక్కు గుర్తు లేకుంటే ఇంకొన్ని సీట్లు వచ్చేవి. శానంపూడి సైదిరెడ్డి కొద్దిల ఓడిపోయిండు. నల్లగొండకు యువరక్తం వచ్చింది. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్దామ‌ని చంద్ర‌శేఖ‌ర్ రావు పిలుపునిచ్చారు.

English summary
TRS chief Chandrasekhar Rao made it clear that the BJP would get below 150 seats in this election. The National Party Congress also would get only 100 seats. Regional parties are going to rule the country after the elections. There were 11 surgical attacks in the UPA cabinet. Surgical attacks are always going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X