వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివేకానంద స్వామికి ఇంగ్లీష్‌లో వచ్చిన మార్కులు చూస్తే ఆశ్చర్యమే!

ఆంగ్లభాష సబ్జెక్టులలో వివేకానందునికి వరుసగా 46, 56 మార్కులు మాత్రమే చ్చాయని, ప్రవేశపరీక్షలో 47 మార్కులు మాత్రమే వచ్చాయన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వామి వివేకానంద స్వామి ఇంగ్లీష్ స్కిల్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంగ్లీష్ కోర్స్ నేర్పే ఇనిస్టిట్యూట్‌లు కూడా ఎక్కువగా వివేకానంద పేరుతో ఉంటాయి. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన తన అనర్గల ప్రసంగంతో అందర్నీ ఆకట్టుకున్నారు.

భారతీయ తాత్వికచింతన, సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనాన్ని ఆయన ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి మంత్రముగ్ధులను చేశారు. అలాంటి స్వామి వివేకానందకు విద్యార్థిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టులో వచ్చిన మార్కులు చూస్తే అందరూ నోరెళ్ల బెట్టవలసిందే.

<strong>స్వామి వివేకానందులను తయారు చేస్తా: సిబిఐ జెడి</strong>స్వామి వివేకానందులను తయారు చేస్తా: సిబిఐ జెడి

/news/2013/05/02/andhrapradesh-cbi-jd-says-he-will-become-teacher-115920.html

అతనికి కూడా అందరిలాగే సాధారణ మార్కులే వచ్చాయి. రచయిత హిందోల్‌ సేన్ గుప్తా తన తాజా పుస్తకం 'మోడ్రన్‌ మాంక్‌: వాట్‌ వివేకానంద మీన్స్‌ టు అజ్‌ టుడే'లో వివేకానందుని జీవితంలోని కొత్త కోణాలను వెల్లడించారు.

వివేకాంద స్వామి కోల్‌కతాలోని ప్రసిద్ధ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించారని, అందువల్లే బ్రిటీష్‌ వారి మాదిరిగా ఆంగ్లంలో ధారణతో రాయగలిగారని, మాట్లాడగలిగారని సేన్ గుప్తా వెల్లడించారు. అయితే, వివేకానందుని విద్యార్హత పత్రాల్లోని ఇంగ్లీష్ మార్కులు చూస్తే ఇంతటి ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయని భావించలేమని పేర్కొన్నారు.

ఫస్ట్‌ స్టాండర్డ్‌(ఎఫ్‌ఏ-ఆ తర్వాత ఇంటర్మీడియట్‌ ఆర్ట్స్‌గా మారింది), బీఏ లలోని ఆంగ్లభాష సబ్జెక్టులలో వివేకానందునికి వరుసగా 46, 56 మార్కులు మాత్రమే చ్చాయని, ప్రవేశపరీక్షలో 47 మార్కులు మాత్రమే వచ్చాయన్నారు. గణితం, సంస్కృతంలలోను ఇవే మార్కులు వచ్చాయన్నారు.

English summary
When Swami Vivekananda Scored 47, 46, 57 Per Cent In English Exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X