• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ స్థార్ క్యాంపెయిన‌ర్లు ఎక్క‌డ‌..! ముంద‌స్తు ముంచుకొచ్చినా ప్ర‌చారం చేయ‌రా..!?

|

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏంజ‌రుగుతోంది. ఓ ప‌క్క అదికార పార్టీ నేత‌లు ప్ర‌చారంలో ప‌దునైన మాటల తూటాల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ స్ఠార్ క్యాపెయిన‌ర్లు క‌నీసం స్పందించ‌కుండా ఏం చేస్తున్నారు.? అదికార గులాబీ పార్టీని త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేత‌ల‌కు అతిముఖ్య‌మైన బాద్య‌ల‌ను అదిష్టానం అప్ప‌గించినా చేష్ట‌లుడిగి చూస్తున్నారు త‌ప్ప అదికార పార్టీ నేత‌ల‌కు కౌంట‌ర్ మాత్రం ఇవ్వ‌డం లేదు.

 ప్ర‌చారంలో దూసుకుపోతున్న గులాబీ పార్టీ..! వెన‌కబ‌డిపోతున్న కాంగ్రెస్..!!

ప్ర‌చారంలో దూసుకుపోతున్న గులాబీ పార్టీ..! వెన‌కబ‌డిపోతున్న కాంగ్రెస్..!!

ఆ విశ‌యాన్ని ప‌క్క‌న పెడితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా త‌మ మార్క్ ఏంటో చూపించుకోలేక పోతున్న‌ట్టు తెలుస్తోంది. పేరుకు రెండు డ‌జ‌న్ల మందిని స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఏఐసిసి అద్య‌క్షుడు రాహుల్ గాంధీ నియ‌మిస్తే అందులో ఒక‌రిద్ద‌రు మిన‌హా ఎవ్వ‌రు కూడా పెద్ద‌గా ప్ర‌జా క్షేత్రంలోకి వ‌చ్చిన ధాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఎన్న‌కాల‌కు ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా స‌మ‌యం లేక‌పోయినా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్లు మాత్రం ఇళ్ల‌కే పరిమితం కావ‌డంతో ఏం చేయాలో అర్ధంకిని ప‌రిస్తితిలో ఉంది టీపిసిసి.

ఏఐసీసీ ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల లిస్ట్ ఇదే..! మ‌రి ఏది ప్ర‌చారం..!!

ఏఐసీసీ ప్రకటించిన స్టార్ క్యాంపైనర్ల లిస్ట్ ఇదే..! మ‌రి ఏది ప్ర‌చారం..!!

రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌, జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గే, అజారుద్దీన్‌, జ్యోతిరాదిత్య సింధియా, గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ చవాన్‌, మీరా కుమార్‌, వి. నారాయణసామి, డీకే శివకుమార్‌, జి. పరమేశ్వర, సల్మాన్‌ ఖుర్షీద్‌, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, ఆర్‌సీ కుంతియా, ఖుష్బూ, నగ్మా మొరార్జీ, విజయశాంతి, రాజ్‌ బబ్బర్‌, అనిల్‌ థామస్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేవంత్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కె. జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, రాములు నాయక్‌, మల్లు భట్టివిక్రమార్క, పి. సుధాకర్‌‌రెడ్డి, డీకే అరుణ, రేణుకా చౌదరి, నేరెళ్ల శారద, వి.హన్మంతరావు, మర్రి శశిధర్‌‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, నదీం జావేద్‌, నితిన్‌ రౌత్‌, జైపాల్‌ రెడ్డి, బీఎస్‌ బోసురాజు, సలీం అహ్మద్‌,

స్టార్ క్యాంపెయిన‌ర్టు ఎక్క‌డ‌..! ప్ర‌జాక్షేత్రంలో ఎక్క‌డా కాన‌రాని కాంగ్రెస్ నేత‌లు..!!

స్టార్ క్యాంపెయిన‌ర్టు ఎక్క‌డ‌..! ప్ర‌జాక్షేత్రంలో ఎక్క‌డా కాన‌రాని కాంగ్రెస్ నేత‌లు..!!

కౌరవులు వంద మంది కానీ మనకు అందులో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, క‌ర్ణుడు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ అంత‌గా తెలియదు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపైనర్లు నలభై మంది కానీ మనకు అందులో పట్టు మని పది మంది కూడా ఫీల్డ్ లో కనిపించడం లేదు. చివరికి స్టార్ క్యాంపైనర్ గా తొలి కిరీటం దక్కించుకున్న సినీ నటి విజయశాంతి హడావుడి కూడా తగ్గిపోయింది. ప్రచార ప్రారంభంలో వరుసుగా ఒక వారం రోజులు హడావుడి చేసిన విజయశాంతి ఆ తరువాత మళ్లీ ఎక్కడా కనిపించడం లేదు. ఇక సోనియా గాందీ ఒక ప్రచార సభలో పాల్గొని మమ అనిపించేశారు.

అజారుద్దీన్ బౌండ్రీ బ‌య‌ట ఉన్నాడా లోప‌లా..! ఎన్నిక‌ల బ‌రిలో ఇన్నింగ్ ప్రారంభించ‌ని క్రికెట‌ర్..!!

అజారుద్దీన్ బౌండ్రీ బ‌య‌ట ఉన్నాడా లోప‌లా..! ఎన్నిక‌ల బ‌రిలో ఇన్నింగ్ ప్రారంభించ‌ని క్రికెట‌ర్..!!

రాహుల్ గాందీ బుధ, గురువారాలు పలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని తన బాధ్యత నెరవేర్చేసుకుంటారు. ఇక మిగిలిన స్టార్ క్యాంపైనర్లలో కొంత మంది తమ తమ నియోజకవర్గాల్లో బిజీగా ఉంటే ఓ ముగ్గురు నలుగురు నామ్ కేవాస్తే అన్నట్లు కొన్ని నియోజకవర్గాల్లో అప్పుడప్పుడు ప్రచారానికి వస్తున్నారు. ఇంకొందరు తమకు టిక్కెట్లు దక్కలేదనో లేక తమ వర్గం నాయకులకు టిక్కెట్లు రాలేదనో ముభావంగా ఉంటున్నారు. ఇక అసలు రాష్ట్రంవైపు కన్నెత్తి కూడా చూడని జాతీయ స్ధాయి స్టార్ క్యాంపైనర్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ తదితరులైతే తెలంగాణ పొలిమేర‌ల‌కు కూడా వచ్చిన దాఖలాలు లేవు. వీరితో పాటు మరికొంత మంది స్టార్ క్యాంపైనర్లు కూడా ప్రచారానికి ఒక్కసారి కూడా వచ్చిన పాపన పోలేదు.

English summary
Whats happening in Telangana Congress Party..? On the other hand, the ruling party leaders are targeting the Opposition parties with sharp words in election campaign. In the face of the party's mainstream leaders, the most important candidates have been given the task of helping the Party to survive in the elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X