హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో రోజూ యాంకర్ ప్రదీప్ డుమ్మా: ఫోన్ స్విచ్చాఫ్, ఇంటికెళ్తే.., పరారీలో ఉన్నారా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Anchor Pradeep case : పరారీలో యాంకర్ ప్రదీప్, ప్రముఖ వ్యక్తి రాయబారం !

హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన యాంకర్ ప్రదీప్ బుధవారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. తొలుత బేగంపేటలోని ట్రాఫిక్ కౌన్సెలింగ్ కేంద్రానికి హాజరై, ఆ తర్వాత కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

తాగొద్దని చెప్పిన ప్రదీప్ వీడియో, పక్కన అమ్మాయి ఉందా, ఎవరు? (వీడియో)తాగొద్దని చెప్పిన ప్రదీప్ వీడియో, పక్కన అమ్మాయి ఉందా, ఎవరు? (వీడియో)

ఈ మేరకు కౌన్సెలింగ్‌కు రావాలని ట్రాఫిక్ పోలీసులు ప్రదీప్‌ను ఆదేశించారు. శుక్రవారం లోపు ఆయన తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. తొలుత శనివారం లోపు.. బుధవారం లోపు హాజరు కావాలని వార్తలు వచ్చాయి. కానీ ఆయన శుక్రవారం లోపు హాజరు కావాల్సి ఉంది.

 ప్రదీప్ రాక కోసం పోలీసులు, మీడియా ఎదురుచూపు

ప్రదీప్ రాక కోసం పోలీసులు, మీడియా ఎదురుచూపు

మొదటి రెండు రోజులు.. అంటే మంగళవారం, బుధవారాల్లో ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరవుతారని పోలీసులు చూశారు. కానీ ఆయన హాజరు కాలేదు. పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులు ఆయన హాజరవుతారని ఆసక్తిగా ఎదురు చూశారు. రెండో రోజూ రాలేదు.

రెండో రోజూ గైర్హాజరు

రెండో రోజూ గైర్హాజరు

ప్రదీప్ రెండు రోజులుగా రాలేదు. మరో రెండు రోజులు మాత్రమే ఆయనకు మిగిలి ఉంది. కౌన్సెలింగ్‌కు ఎవరైనా తల్లి, భార్య, లేదా ఇతర కుటుంబ సభ్యులతో హాజరు కావాల్సి ఉంది. అవసరమైతే ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా తాళం వేసి ఉందని సమాచారం.

 ఆఫీస్‌కు వెళ్లగా చుక్కెదురు, ఫోన్ స్విచ్చాఫ్

ఆఫీస్‌కు వెళ్లగా చుక్కెదురు, ఫోన్ స్విచ్చాఫ్

కూకట్‌పల్లిలోని కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా చుక్కుదురయింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. దీంతో అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు.. ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఆయన రాకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

200 మంది మందు బాబులకు కౌన్సెలింగ్

200 మంది మందు బాబులకు కౌన్సెలింగ్

బుధవారం సుమారు 200 మంది మందుబాబులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి పట్టుబడిన వారి వెంట ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. బేగంపేట ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించే గది రెండో అంతస్తులో ఉండటంతో వెంట వచ్చిన మహిళలు, వృద్ధులు కొంత ఇబ్బంది పడ్డారు.

 కొందరి పశ్చాత్తాపం

కొందరి పశ్చాత్తాపం

తమ కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో ఉన్నారని, తమ పరిస్థితి ఏమిటి అని కొందరు ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించారు. తప్పనిసరిగా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉండాలని పోలీసులు చెప్పారు. కౌన్సెలింగ్ అనంతరం కోర్టుకు హాజరై శిక్ష లేదా జరిమానా అనంతరమే స్వాధీనం చేసుకున్న వాహనాన్ని తిరిగి అప్పగించే వీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన పలువురు ఇక మద్యం తాగి వాహనం నడపమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

English summary
Popular TV anchor Pradeep Machiraju is hogging the limelight for wrong reasons. The anchor, famous for his celebrity chat show 'Konchem Touch Lo Unte Cheputa,' was recently arrested in a drunken drive case on New Year eve at Jubilee Hills road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X