హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్క‌డ బాంబ్ పేలింది..! ఇక్క‌డ పేరు మారింది..! అది వ‌ర‌స‌..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పాక‌స్తాన్ లో అంత‌ర్బాగ‌మైన క‌రాచి పేరుతో మొన్న‌టి వ‌ర‌కూ ఆరు కేకులు, మూడు బిస్క‌ట్లుగా వ్యాపారం జోరుగా సాగేది. క‌రాచీ బేక‌రీతో విక్ర‌యించే తినుబండారాల‌లో భార‌తీయులు మొన్న‌టి వ‌ర‌కు రుచిని మాత్ర‌మే చూసారు త‌ప్ప పేరు వెన‌క ఉన్న జాతి విద్వాషాన్ని ఏనాడు ఖాత‌రు చేయ‌లేదు. కాని మొన్న‌టికి నేటికి ప‌రిస్థితిలో చాలా మార్పు వ‌చ్చింది. పాకిస్తాన్ పేరు చెప్తేనే భార‌తీయుల ర‌క్తం మ‌రుగుతోంది. దీంతో పాకిస్తాన్ కు సంబందించిన పేరునుగాని, దాని భూభాగంలో ఉన్న ప్రాంతాల పేరును గాని ఉచ్చ‌రించేందుకు భార‌తీయులు స‌సేమిరా అంటున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా క‌రాచీ బేక‌రీ పేరుతో కొన‌సాగుతున్న సంస్థ త‌న పేరును మార్చుకొనేంద‌కు నిర్ణ‌యం తీపుకున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో భార‌తీయుల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిపోతోంది.

Where the bomb exploded ..! The name changed here! Thats it .. !!

కరాచీ బేకరీ పేరును ఇకపై ఇండియన్ కరాచీ బేకరీగా మారుస్తూ ఆ సంస్ధ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు గొడుగు శ్రీనివాస్‌ యాదవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పుల్వామ ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా 'కరాచీ బేకరీ'లకు హెచ్చ‌రిక‌లు మొదలైన విషయం తెలిసిందే. పేరు మార్చుకోవలసిందే అంటూ పలువురు డిమాండ్ చేశారు. దీంతో ఆ సంస్థ తమ బ్రాంచ్‌ల దగ్గర సెక్యురిటీ పెంచడంతో పాటు ఇది అచ్చమైన భారతీయ సంస్థేనని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. అయితే పేరు మార్పుపై కరాచీ బేకరీ యాజమాన్యం తాజాగా ఓ ప్రకటకన చేసింది. ఇకపై తమ సంస్థలకు 'ఇండియన్ కరాచీ'గా పేరు మారుస్తున్నట్టు తెలిపింది. మోజాంజాహి మార్కెట్‌ దగ్గర ఉన్న కరాచీ బేకరీ యాజమాన్యాన్ని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆధ్వర్యంలోని బీజేపీ నేతలు సంప్రదించగా ఈ మేరకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో ఇండియన్‌ కరాచీ బేకరీ పేర్లు అన్ని బేకరీలకు మారుస్తామని యాజమాన్యం తెలిపినట్టు తెలుస్తోంది.

English summary
BJP state council member G. Srinivas Yadav said in a statement that the management of the company is now making the Karachi bakery name the Indian Karachi bakery. After the Pulwama aggression, the 'Karachi bakery' warnings across the country have been known. Many wanted to change the name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X