వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యాన్స‌ర్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వ్యాధి.!అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న విప్ గొంగిడి సునిత.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : క్యాన్సర్ మహమ్మారిపై విస్తృతంగా అవ‌గాహ‌న పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునిత పేర్కొన్నారు. అశ్విన్స్‌ క్యాన్స‌ర్ కేర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ క్యాన్స‌ర్ డే సంద‌ర్భంగా నిర్వహించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో సునిత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడారు. బయట షాపుల్లో విక్రయించే తినుబండారాల వల్లే క్యాన్సర్ ఎక్కువగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. చాక్ల‌ట్లు, ఫాస్ట్ ఫుడ్‌, వైట్ ఘగ‌ర్‌, జంక్‌ఫుడ్ క్యాన్స‌ర్‌కు ప్రధాన కారణాలని, వాటి వినియోగం తగ్గించుకోవాల‌ని సూచించారు. జీవితంలో చోటు చేసుకున్న‌, టెన్ష‌న్లు, ఉరుకుల పరుగుల జీవితం, జీవ‌న‌ వైవిధ్యాలు క్యాన్స‌ర్ భారిన‌ప‌డేలా చేస్తున్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేసారు గొంగిడి సునీత.

 Whip Gongidi Sunita who needs to raise awareness on Cancer disease.!
అంతే కాకుండా క్యాన్సర్ పై అవగాహన కలిగించే సందేశాత్మక బెలూన్లను ఎగుర‌వేశారు. కాగా ఈ మ‌ధ్య కాలంలోనే ప‌ర‌మ‌ప‌దించిన ఆడమూర్ శాంతి కి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాన్స‌ర్ భారిన ప‌డిన‌ మ‌ల్లిక త‌న స్వీయ అనుభ‌వాల‌ను వివ‌రించారు. డాక్ట‌ర్ గీతా నాగ‌శ్రీ క్యాన్స‌ర్ అశ్విన్ క్యాన్స‌ర్ కేర్ ఫౌండ‌ష‌న్ చేస్తున్న విస్తృత సేవ‌లు వివ‌రించారు. ప్ర‌తి ఏడాది పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మం పెద్ద‌జ‌రుగుతుంద‌ని, అయితే ఈ సంవత్స‌రం కొవిడ్ కార‌ణంగా అవ‌గాహ‌న‌ను కార్య‌క్ర‌మాన్ని సాధార‌ణంగా ర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. అశ్విన్స్ క్యాన్స‌ర్ కేర్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు డాక్ట‌ర్ గీత‌ా నాగ‌శ్రీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు వ‌ర‌ల‌క్ష్మి మంచాల త‌దిత‌రులు పాల్గొన్నారు.
English summary
Government whip Gongidi Sunita said there was a need to raise awareness on the cancer epidemic. Sunita participates in an awareness program on the occasion of World Cancer Day under the auspices of the Ashwin Cancer Care Foundation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X