వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాస్ కూచిభొట్ల మృతిపై వైట్‌హౌస్, ట్రంప్! ఇప్పుడేమంటావ్: హిల్లరీ

కాన్సాస్ కాల్పుల పైన వైట్ హౌస్ స్పందించింది. కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందడం కలచివేసిందని శ్వేత సౌధం ప్రతినిధి మంగళవారం నాడు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/వాషింగ్టన్: కాన్సాస్ కాల్పుల పైన వైట్ హౌస్ స్పందించింది. కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందడం కలచివేసిందని శ్వేత సౌధం ప్రతినిధి మంగళవారం నాడు తెలిపారు.

జాతి, మతం ఆధారంగా అమెరికాలో హింసకు ఎలాంటి తావు లేదని స్పష్టం చేశారు. పౌరుల హక్కులను కాపాడాలన్న తమ ప్రాథమిక విధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఏ పౌరుడైనా ఏ ఏ మత ధర్మాన్నైనా స్వేచ్ఛగా పాటించవచ్చునన్నారు.

కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ.. కాన్సాస్ కాల్పులు: నిందితుడు పచ్చి తాగుబోతు, ట్రంప్ పార్టీ కార్యకర్త కానీ..

ఇప్పుడేం చెబుతారు: ట్రంప్‌కు హిల్లరీ ప్రశ్న

అమెరికాలో జాత్యాహంకార దాడిలో తెలుగు యువకుడు శ్రీనివాస్ మరణించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను విదేశాంగ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ప్రశ్నించారు. ఇప్పుడేం సమాధానం చెబుతారని అడిగారు.

White House condemns Kansas shooting, Hillary Clinton Says President Trump Must Step Up

దేశంలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాల పైన ట్రంప్ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. బెదిరింపులు, జాత్యాహంకార నేరాలు పెరుగుతుననందున ట్రంప్ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని హిల్లరీ ట్వీట్ చేశారు.

అంతేకాదు, ఈ ప్రభుత్వం మైనార్టీల రక్షణకు ఏం చేస్తుందో నాకు సమాధానం చెప్పాలని శ్రీనివాస్ భార్య సునయన నిలదీశారు. ఈ వార్తతో కూడిన క్లిప్పింగ్‌ను హిల్లరీ ట్వీట్ చేశారు. మరోవైపు, శ్రీనివాస్ కూచిభొట్ల మృతి నేపథ్యంలో కన్సాస్‌లో ర్యాలీ చేపట్టారు.

English summary
The White House has said that the early reports coming from Kansas, where an Indian engineer was shot dead and another injured in an apparent hate crime, were “disturbing.” The White House also condemned the alleged hate crimes against the Jewish community in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X