వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగా కోడలు ఉపాసనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్‌ విముక్తి కోసం చాలామంది సెలబ్రిటీలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి పై అవగాహన తీసుకొస్తూ సినిమా సెలిబ్రిటీల నుంచి రాజకీయనాయకులు, స్పోర్ట్స్ స్టార్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై అవగాహన కల్పించడంలో మెగా ఫ్యామిలీ ముందువరసలో ఉందని చెప్పొచ్చు. తాజాగా మెగా కోడలు హీరో రామ్ చరణ్ తేజ్ భార్య అయిన ఉపాసనా కూడా కోవిడ్-19 పోరులో భాగస్వామ్యం అయ్యారు. ఆమె చేస్తున్న సేవను ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ టెడ్రాస్ ప్రశంసిస్తూ స్వయంగా ట్వీట్ చేశారు.

 కరోనా: అమెరికాపై WHO సంచలనం.. మారకుంటే శవాల గుట్టలే గతి.. ట్రంప్ వల్లే 15వేల మంది బలి కరోనా: అమెరికాపై WHO సంచలనం.. మారకుంటే శవాల గుట్టలే గతి.. ట్రంప్ వల్లే 15వేల మంది బలి

ప్రస్తుతం కరోనావైరస్ పోరులో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యసిబ్బంది నిజమైన హీరోలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. అంతేకాదు ఏప్రిల్7న జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలపాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే #ThanksHealthHeros హ్యాష్‌టాగ్ పేరుతో ఒక క్యాంపెయిన్ నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలపడమే.

WHO Chief Tedros thanks Upasana for her contribution over fight for Covid-19

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌కు మెగాకోడలు ఉపాసనా స్పందించారు. ఆమె ఓ వీడియో చేసి ట్వీట్ చేశారు. ఈ ఆపత్కాల సమయంలో వైద్య సిబ్బందిని ప్రశంసిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు ఈ సమయంలో అంతా ఇళ్లకే పరిమితం కావాలని అదే సమయంలో సామాజిక దూరంను కూడా పాటించాలంటూ వీడియో ద్వారా చెప్పారు. ఆ వీడియోను ప్రపంచ ఆరోగ్య సంస్థ, తెలంగాణ సీఎంఓకు కూడా ట్యాగ్ చేశారు.

ఉపాసనా ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోను చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ స్పందించారు. థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఉపాసనాకు ధన్యవాదాలని చెప్పారు. అంతేకాదు ఈ పోరులో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్లు, నర్సులు ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు టెడ్రోస్. ఇక ప్రతి ఏటా ఒక నినాదంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2020 థీమ్ " ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్‌వైఫ్‌"లుగా ఎంచుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా మహమ్మారిపై పోరాడుతున్నవీరికి ఈ ఏడాదిని అంకితం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

English summary
World Health Organisation Chief Dr. Tedros had lauded the efforts put in by Upasana Kamineni for her role in the fight against covid-19. Tedros tweeted the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X