వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొడ్డుపల్లి శ్రీనివాస్ కేసు: కీలకమైన కాల్‌డేటా, 'బెయిల్ గురించే మాట్లాడారు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్గొండ మున్సిఫల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో తొలుత నుండి కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టుగానే అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా కొన్ని మీడియా సంస్థలు నిందితుల కాల్ డేటాను బయటపెట్టాయి. దీని ఆధారంగా ఈ కేసుపై మరిన్ని అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: ట్విస్టిచ్చిన నల్గొండ టూటౌన్ సీఐ, కాంగ్రెస్ సభబొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య: ట్విస్టిచ్చిన నల్గొండ టూటౌన్ సీఐ, కాంగ్రెస్ సభ

నల్గొండ కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ గత నెల 24వ, తేది రాత్రి హత్యకు గురయ్యారు. శ్రీనివాస్ అనుచరులే ఆయనను హత్య చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరికి బెయిల్ కూడ వచ్చింది.

అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నల్గొండ సిఐ వెంకటేశ్వర్లు రెండు రోజుల పాటు అదృశ్యం కావడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బాపట్ల రిసార్ట్ లో ఉన్న సిఐ వెంకటేశ్వర్లును పోలీసులు తీసుకొచ్చారు. రిలాక్స్ అయ్యేందుకు బాపట్ల వెళ్ళినట్టు సిఐ చె.ప్పారు. అంతేకాదు విధుల్లో కూడ చేరారు. మరో వైపు ఎన్టీవి, సాక్షిమీడియాలు నిందితుల కాల్ డేటాపై కథనాలను ప్రసారం చేశాయి. ఈ కథనాల ప్రకారంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో నిందితులెవరు

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో నిందితులెవరు


బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మిర్చి బండీ వద్ద జరిగిన వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నిందితులను అరెస్ట్ చేశారు. బెయిల్ పై శుక్రవారం నాడు నిందితులు విడుదలయ్యారు. అయితే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం శ్రీనివాస్ హత్యపై టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని ఆరోపణలు చేశారు. నిందితుల కాల్ డేటాను పరిశీలించాలని కోరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంపై ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే ఈ ఆరోపణలు ఖండించారు. అయితే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితుు నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సోదరులతో మాట్లాడినట్టు కాల్ డేటాలో బయటపడిందని సాక్షి, ఎన్టీవి కథనాలను ప్రసారం చేశాయి.

కాల్ డేటాతో అనుమానాలు

కాల్ డేటాతో అనుమానాలు

కేసు విచారణలో కీలకంగా మారిన కాల్‌డేటాను ఎన్టీవి బయటపెట్టింది. హత్యకు ముందు ఆ తర్వాత నిందితులు నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సోదరులతో మాట్లాడినట్టు ఎన్టీవి కథనంలో ప్రసారం చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ ఇదే రకమైన ఆరోపణలు చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను ఎందుకు విచారించలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కేసు విషయమై మాట్లాడారు

కేసు విషయమై మాట్లాడారు

కేసు విషయమై తనతో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులు మాట్లాడారని నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం సోదరుడు న్యాయవాది రంజిత్ ఎన్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.హత్య చేసిన మరునాడు తనతో మాట్లాడారని చెప్పారు. బెయిల్ గురించి అడిగినట్టు ఆయన చెప్పారు. అయితే తొలుత పోలీసులకు లొంగిపోవాలని తాను సలహ ఇచ్చానని వీరేశం సోదరుడు రంజిత్ చెప్పారు.

పార్టీ మారలేదనే హత్య

పార్టీ మారలేదనే హత్య

రాజకీయ ఒత్తిళ్ళతోనే హత్య జరిగిందని నల్గొండ మున్సిఫల్ చైర్మెన్ లక్ష్మి ఆరోపించారు. నెల రోజులుగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం నుండి తన భర్త శ్రీనివాస్ కు పార్టీ మారాలని ఒత్తిడులు ఎక్కువయ్యాయని, ప్రతి రోజూ ఫోన్లు చేసేవారని లక్ష్మి గుర్తు చేసుకొన్నారు. పార్టీ మారకుండా ఉన్నందునే తన భర్తను హత్య చేశారని లక్ష్మి ఎన్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

నా వాంగ్మూలం తీసుకోలేదు

నా వాంగ్మూలం తీసుకోలేదు

సంఘటనాస్థలికి పోలీసులు ఆలస్యంగా వచ్చారని నల్గొండ మున్సిఫల్ చైర్ పర్సన్ లక్ష్మి ఆరోపించారు. తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొన్నట్టు చెప్పారు. పోలీసులను బతిలాడినట్టు ఆమె చెప్పారు. పోలీసులతో పాటు తాను కూడ సంఘటన స్థలానికి చేరుకొన్నట్టు లక్ష్మి ఎన్టీవికి చెప్పారు.

English summary
Congress leader and husband of Nalgonda Municipal Chairperson Lakshmi's murder has created sensation across the state and Boddupalli Srinivas is also a close aide of Congress MLA Komatireddy Venkat Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X