వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షేర్ లింగంప‌ల్లి లో ఎవ‌రు షేర్ ఖాన్..? కొద్ది గంట‌ల్లో వీడ‌నున్న స‌స్పెన్స్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : షేర్ లింగంప‌ల్లి లో చ‌క్రం తిప్పేది ఎవ‌రు ? | Oneindia Telugu

హైద‌రాబాద్ : తెలంగాణ లో సంచ‌ల‌నంగా మారిన ఆ నియోజ‌క వ‌ర్గంలో చ‌క్రం తిప్పేది ఏ పార్టీ..! తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి బంప‌ర్ మెజారిటీతో ఆ నియోజ‌క వ‌ర్గంనుండి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినా పరిస్థితుల ప్ర‌భావంతో ఆ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని వీడి అదికార పార్టీలో చేరిపోయారు. ఇక ఎప్ప‌టినుండో పార్టీకి సేవ‌లందిస్తూ గ‌తంలో టికెట్ పొంద‌లేక పోయిన ఆ ప్ర‌జా నాయ‌కుడు మ‌ళ్లీ అద్రుష్టాన్ని ప‌రిక్షించుకోబోతున్నారు. కాని ప్ర‌ముఖ సిని నిర్మాత, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. అంతే కాకుండా పొత్తు ధ‌ర్మం పాటిస్తూ ఆ సీటును కాంగ్రెస్ కు కేటాయించాల‌ని అక్క‌డి స్థానిక కాంగ్రెస్ నేత నానా యాగీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను మ‌రిపిస్తున్న షేర్ లింగంప‌ల్లి నియోజ‌క వ‌ర్గంలో జెండా పాతేది ఎవ‌రు..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

షేర్ లింగం ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంపై హైడ్రామా..! మ‌రి కొద్ది గంట‌ల్లో తేల‌నున్న‌అభ్య‌ర్థుల భ‌విత‌వ్వం..!

షేర్ లింగం ప‌ల్లి నియోజ‌క వ‌ర్గంపై హైడ్రామా..! మ‌రి కొద్ది గంట‌ల్లో తేల‌నున్న‌అభ్య‌ర్థుల భ‌విత‌వ్వం..!

అదేమీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తోన్న సీట్ కాదు. ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానం అస‌లే కాదు. కానీ, ప్రస్తుతం అది హాట్ సీట్. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వాతావరణాన్ని బాగా వేడెక్కించిన సీట్. తమ నాయకుడుకి దక్కాల‌ని కొంద‌రు, లేదు తమ నాయకుడుకే ఆ సీటు దక్కాలంటూ మ‌రికొంత మంది కార్యకర్తలు గొంతు చించుకుంటూ, చేతులు కోసుకుంటోన్న సీటు. ఓకే పార్టీలో ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు దాడి చేసుకుంటోన్న సీటు.! అదే శేరిలింగంపల్లి నియోజ‌క వ‌ర్గ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీటు..!

 గాంధీ పై ప్ర‌తికూల వాతార‌ణం..! టీడిపి నుండి మొవ్వా కే ఛాన్స్ ..!!

గాంధీ పై ప్ర‌తికూల వాతార‌ణం..! టీడిపి నుండి మొవ్వా కే ఛాన్స్ ..!!

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. తెలంగాణ ముందుస్తు ఎన్నికల్లో అది హాట్ సీట్ గా మారింది. గడచిన ఎన్నికల్లో ఈ సీటు నుంచి టీడీపీ-బీజేపీ కూటమి తరఫున అరికెపూడి గాంధీ పోటీ చేశారు. సుమారు 75 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గాంధీ గెలిచారు. దాంతో ఈ సీటు టీడీపీ కంచుకోట అన్నది స్పష్టమైంది. కాలక్రమంలో గాంధీ టీడీపీని వీడి టీఆర్ఎస్ పక్షంలో చేరారు. తాజాగా ఈ సారి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ నుంచి గాంధీ బరిలో ఉన్నారు. అయితే, గాంధీ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.

భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ ఎక్ ద‌మ్ కొత్త మొఖం..! ప్ర‌జ‌ధ‌ర‌ణ క‌ష్ట‌మంటున్న స్థానికులు..!

భ‌వ్య ఆనంద్ ప్ర‌సాద్ ఎక్ ద‌మ్ కొత్త మొఖం..! ప్ర‌జ‌ధ‌ర‌ణ క‌ష్ట‌మంటున్న స్థానికులు..!

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమిలో ఈ సీటు మరోసారి హాట్ సీటు ను తలపిస్తోంది. మహాకూటమిలో భాగంగా టీడీపీ కోరుతున్న మొట్టమొదటి సీటు ఇదే. ఈ సీటు టీడీపీకి ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సుముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారి భవ్య ఆనంద్ ప్రసాద్ టీడీపీ తరపున బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ ద్వారా చంద్రబాబుకు సిఫార్సు చేయించుకున్నట్టు సమాచారం. కాని ఆనంద్ ప్ర‌సాద్ షేర్ లింగంప‌ల్లి నియోజ‌క వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కాద‌ని, అలా అని అక్క‌డ ప్ర‌జ‌ల‌తో ఎప్పుడూ ఎలాంటి సంబందాలు నెర‌ప‌లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆనంద్ ప్ర‌సాద్ కు ఉన్న ప‌ళంగా సీటు కేటాయిస్తే కొత్త‌మొఖం అవుతుంద‌ని, ప్ర‌జ‌లు అంత‌గా ప‌ట్టించుకోర‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. పైగా ఆనంద్ ప్ర‌సాద్ కు అనేకూల వాతార‌ణం క‌న్నా ప్ర‌తికూల వాత‌ర‌ర‌ణ‌మే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు స్థానికులు చెప్పుకొస్తున్నారు.

చ‌తుర్ముఖ పోటీ త‌ప్ప‌దు..! కాని టీడిపి అభ్య‌ర్ధికే అనుకూల వాతావ‌ర‌ణం..!!

చ‌తుర్ముఖ పోటీ త‌ప్ప‌దు..! కాని టీడిపి అభ్య‌ర్ధికే అనుకూల వాతావ‌ర‌ణం..!!

ఇక ఇదే పార్టీ నుంచి మరో అభ్యర్థి మొవ్వా సత్యనారాణయ కూడా పోటీలో ఉన్నారు. మొవ్వా గట్టి ప్రయత్నాలు చేస్తున్నటు తెలుస్తోంది. స్థానిక నేత‌ల‌తో సంత్సంబాదాలు క‌లిగిన మొవ్వా షేర్ లింగంప‌ల్లిలో మంచి ప్ర‌జాబ‌లం పొంద‌గ‌లిగారు. గ‌త ఎన్నిక‌ల్లో త్రుటిలో సీటు మిస్స‌యిన మొవ్వా ఏ మాత్రం ఆత్మ స్తైర్యం చెదిరిపోకుండా ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. స్థానికుల అండ మెండుగా ఉండ‌డం మొవ్వా అనుకూల ప‌రిస్థితులుగా చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా, మధ్యలో కాంగ్రెస్ కూడా సీటును ఆశిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మళ్లీ సీన్ లోకి వచ్చారు. శేరిలింగంపల్లి సీటు టీడీపీకి ఇవ్వొద్దని అనుచరులతో వచ్చి గాంధీ భవన్ వద్ద నానా హడావుడి చేశారు. ఐన‌ప్ప‌టికి షేరిలింగం ప‌ల్లి సీటు తెలుగుదేశం పార్టీకి కేటాయించేందుకే కాంగ్రెస్ అదిష్టానం సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మెవ్వా స‌త్య‌నారాయ‌ణనే రంగంలోకి దింపేందుకు టీడిపి అదిష్టానం మొగ్గు చూపుతునట్టు తెలుస్తోంది.

English summary
The electoral heat started in Telangana. Candidates Campaign in the constituencies have also begun. In the twin cities, the key constituency in Sherlingam pally is more than a ticket to the leaders. bhavya anand prasad, movva satyanarayana contesting from tdp. tdp high will decide the candidate with in few hours. but movva is favourite candidate in the constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X