వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కేసు: ఎవరీ రామారావు.. రేవంత్‌నే ఎందుకు టార్గెట్ చేశాడు..?

|
Google Oneindia TeluguNews

రేవంత్ రెడ్డి ఆస్తులపై ఆ వ్యక్తి పిటిషన్ వేశారు. రేవంత్ ఆస్తులన్నీ సక్రమంగా సంపాదించలేదని అక్రమంగా సంపాదించారన్నది ప్రధాన అభియోగం చేశారు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి వేసిన పిటిషన్‌తో రేవంత్ రెడ్డి ఆస్తుల చిట్టా విప్పే పనిలో పడింది ఆదాయపు పన్ను శాఖ. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఆ వ్యక్తి కోసం గూగుల్‌లో తెగ సెర్చింగ్‌లు మొదలయ్యాయి.

రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించిన పిటిషన్ అది . ఆ పిటిషన్‌ను వేసింది మరెవరో కాదు. రామారావు అనే అడ్వకేటు. ఇంతకీ రామారావుకి రేవంత్ రెడ్డికి ముందుగానే పరిచయముందా... అసలు రామారావు రేవంత్ రెడ్డిపై ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చింది అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒక్కసారిగా రామారావు పేరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ క్రమంలోనే ప్రముఖ జర్నలిస్టు రామారావును ఇంటర్వ్యూ చేశారు. రేవంత్ రెడ్డి బాధితుడు ఒకరు తనను అప్రోచ్ అయినట్లు రామారావు తెలిపారు. ఇక అక్కడి నుంచి రేవంత్ రెడ్డి అతని కంపెనీలను స్టడీ చేయడం మొదలు పెట్టినట్లు రామారావు తెలిపారు. ఆ తర్వాత అక్రమాస్తులు ఉన్నాయని గ్రహించాక పిటిషన్ వేశారు. జూలై 24 సీబీఐకి రేవంత్ అక్రమాస్తులపై ఫిర్యాదు చేశారు రామారావు. తన కంపెనీల ముసుగులో రేవంత్ రెడ్డి మనీలాండరింగ్‌కు కూడా పాల్పడ్డారని రామారావు తెలిపారు.

Who is this Ramarao...why did he target Revanth Reddy?

అయితే ఇంటర్వ్యూ సందర్భంగా అడ్వకేట్ రామారావుపై కూడా కేసులున్నాయని జర్నలిస్టు ఆయన్ను ప్రశ్నించారు. రామారావు తనపై నాలుగు కేసులు ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అయితే రామారావుపై 32 కేసులున్నాయని జర్నలిస్టు ఆ పోలీస్ కంప్లయింట్‌ల జాబితా తన ముందు ఉంచాడు. అయితే దీనికి రామారావు నీళ్లు నమిలాడు. కోర్టు ముందు ఉన్న కేసులపై తను కామెంట్ చేయనని తెలివైన సమాధానం చెప్పాడు. తనపై కేసులను కోర్టులో డిఫెండ్ చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఆ 32 కేసులు తనపై కట్టుకథలే అని రామారావు బదులిచ్చారు. రామారావు బ్లాక్ మెయిల్ చేసి కోర్టులో కేసు వేస్తారని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి అనుచరులు. రేవంత్ రెడ్డి మీద కోర్టులో కేసులున్నాయి అది ఎందుకు బయటకు రావడం లేదని రామారావు ప్రశ్నించారు. దీనికి జర్నలిస్టు మీపై కూడా ఉన్న కేసులు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. అదే సమయంలో మరో హైకోర్టు న్యాయమూర్తి రచనారెడ్డి కూడా తన స్పందన తెలిపారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు అని తెలిపారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి పైకి రామారావు అనే బాణం విసిరింది టీఆర్ఎస్ పార్టీయేనని విపక్షాలు చెబుతున్నాయి.

English summary
Rama Rao is the name thats been making news since the IT raids began on congress leader Revanth Reddy. Rama rao is the person who filed the petition on Revanth reddy saying that he was invovled in money laundering case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X