వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్.. నీ లైఫ్‌కే రిస్క్ గురూ.. ఆషామాషీగా చెప్పేదేమీ కాదు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అరచేతిలో ప్రపంచం వాలిపోయిన రోజులివి. స్మార్ట్‌ఫోన్‌తో ఏ సమాచారమైనా ఇంట్లో కూర్చుండి తెలుసుకునే సౌకర్యం వచ్చింది. అయితే అదే స్మార్ట్‌ఫోన్ కొందరి పాలిట భూతంగా మారుతోంది. అందివచ్చిన టెక్నాలజీ ఉపయోగించుకుని తెలివిగా వాడుకోవాల్సిన స్మార్ట్‌ఫోన్‌ను కొందరు ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. గంటలకొద్దీ వీడియో గేమ్స్ ఆడుతూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు.

అయితే కొందరు తెలివిగా సమాధానం చెబుతుంటారు. తాము ఖాళీ సమయాల్లో మాత్రమే గేమ్స్ ఆడతామని గొప్పగా బిల్డప్ ఇస్తారు. అయితే తస్మాత్ జాగ్రత్త అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

కారు టార్గెట్.. టీఆర్ఎస్‌ను గద్దె దించేది మేమే.. దూకుడు పెంచిన కాంగ్రెస్కారు టార్గెట్.. టీఆర్ఎస్‌ను గద్దె దించేది మేమే.. దూకుడు పెంచిన కాంగ్రెస్

తస్మాత్ జాగ్రత్త.. వీడియో గేమ్స్ ఆడటం రోగమట..!

తస్మాత్ జాగ్రత్త.. వీడియో గేమ్స్ ఆడటం రోగమట..!

వీడియో గేమ్స్ తెగ ఆడేస్తున్నారా..! అయితే జర భద్రం. కొందరు మరో పని లేనట్లుగా అదేపనిగా వీడియో గేమ్స్ ఆడుతుంటారు. గంటల తరబడి అందులో మునిగి తేలుతూ తెగ ఆనందిస్తుంటారు. ఖాళీ సమయాల్లో ఆడుకుంటున్నాం, తప్పేంటట అని తప్పులో కాలు వేయొద్దు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌వో. అదొక వ్యాధి అంటూ బాంబ్ పేల్చింది.

అంతర్జాతీయ వ్యాధిగా గేమింగ్ డిజార్డర్

అంతర్జాతీయ వ్యాధిగా గేమింగ్ డిజార్డర్

స్మార్ట్‌ఫోన్ తెరపై వేళ్లు ఆడిస్తూ వీడియో గేమ్స్ ఆడటం మంచిది కాదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కూర్చుని, పడుకుని అదే పనిగా గేమ్స్ ఆడుతుంటే అది మోస్ట్ డేంజరస్ అని హెచ్చరిస్తోంది. గంటలకొద్దీ స్మార్ట్‌ఫోన్‌లో వీడియో గేమ్స్ ఆడుతుంటే అసలుకే ఎసరు వస్తుందని చెబుతోంది. వీడియో గేమ్స్ అదేపనిగా ఆడటం ఒక వ్యాధి అంటూ డబ్ల్యూహెచ్‌వో తొలిసారిగా గుర్తించడం కలవరపెడుతోంది.

జెనీవాలో జరిగిన సభ్య దేశాల వార్షిక సాధారణ సమావేశంలో కీలక అంశం తెరపైకి వచ్చింది. గేమింగ్ డిజార్డర్‌ను అంతర్జాతీయ వ్యాధిగా గుర్తించి 2018 జాబితాలో చేర్చాలని సభ్య దేశాలు అధికారికంగా తీర్మానం చేశాయి. అదలావుంటే గేమింగ్ పరిశ్రమలో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన పలు కంపెనీల యాజమాన్యాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యను వ్యతిరేకించారు. గేమింగ్ డిజార్డర్ నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని కోరారు. ఈ - స్పోర్ట్స్ రంగంలోకి వచ్చే గేమింగ్‌ను అలా చూడటం సరికాదన్నారు. గేమింగ్ ద్వారా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంటే.. డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం వల్ల ఔత్సాహికులు ఈ రంగంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేరని వాపోతున్నారు.

అదే పనిగా ఆడొద్దు.. బీ కేర్ ఫుల్

అదే పనిగా ఆడొద్దు.. బీ కేర్ ఫుల్

వీడియో గేమ్స్ కొందరి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఏదో సరదా కోసమని, టైమ్‌పాసంటూ ఖాళీ సమయాల్లో వాటితో కుస్తీపడుతూ.. చివరకు ఫుల్‌టైమ్‌గా ఆడేస్తున్నారు. సమయ, సందర్భాలు లేకుండా వీడియో గేమ్స్‌ ఆడుతుండటం ద్వారా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఏదైనా మితంగా ఉంటే ఓకే.. బానిస ఐతే మాత్రం కష్టం. జీవితం నరక ప్రాయమే.

అదే ధ్యాసగా వీడియో గేమ్స్ ఆడుతున్నవాళ్లలో నరాలు వీక్ అవుతున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. అంతే కాదు మానసిక ప్రవర్తనలో మార్పు వస్తోంది. క్షణకాలం ఫోన్ చేతిలో లేకుండా అదోలా ఫీలవుతున్నవారు తస్మాత్ జాగ్రత్త. ఏదో సరదా కోసం ఏ కొద్దిసేపో ఆడితే సమస్య లేదు గానీ.. అదే పనిగా ఆడేవారు మాత్రం కచ్చితంగా తమ నిర్ణయం మార్చుకోవాల్సిందే.

English summary
Playing video games to excess is now a medical condition recognized as an addiction disorder by the World Health Organization. The WHO has updated its official diagnostic manual, to include gaming disorder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X