వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మూడో కన్ను తెరవకుండా ఇంత కాలం ఆపింది ఎవరు?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : రాజ‌కీయ నేత‌ల‌పై న‌మోదైన కేసులను ఆ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ కోస‌మే వినియోగించుకోవ‌చ్చా..? రాజ‌కీయ ప‌బ్బం గ‌డిచాక కేసుల‌ను ఎటువైపైనా మ‌ళ్లించొచ్చా..? అస‌లు కేసుల్లో ఇరుకిస్తుంది శిక్ష‌ల కోస‌మా.? రాజ‌కీయ బ్లాక్ మెయిలింగ్ కోస‌మా..? తెలంగాణ ఆప‌థ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు మూడోక‌న్ను తెర‌వ‌క పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణాలు ఉన్నాయా..?

చ‌ంద్ర‌శేఖ‌ర్ రావుకు మూడోక‌న్న క‌న్ను ఉంద‌న్న విష‌యం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది..? ఒక్క ఉప‌న్యాసం .. వంద ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను వెదుకుతోంది. సీఎం కెసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో కరకట్టకు వెళ్లి చంద్రబాబును ఆయుత చండీయాగానికి ఆహ్వానించినప్పుడు చంద్రబాబు మంచోడేనా? నిజంగా చంద్రబాబు ద్రోహి అని కెసీఆర్ భావిస్తే ఆయుత చండీయాగానికి చంద్రబాబును ఎందుకు పిలిచినట్లు?

 భావోద్వేగ‌ ప్ర‌సంగాలు పున‌రావ్రుతం చేస్తే ఎవ‌రికి ప్ర‌యోజ‌నం..?

భావోద్వేగ‌ ప్ర‌సంగాలు పున‌రావ్రుతం చేస్తే ఎవ‌రికి ప్ర‌యోజ‌నం..?

న‌ల్ల‌గొండ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ ప‌ట్టు త‌ప్పి ప్ర‌సంగించిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఉద్య‌మ కాలంలో తెలంగాణ‌కు అడ్డుప‌డ్డ నాయ‌కుల‌ను ఏకిపారేసిన సంద‌ర్బాల‌ను తెలంగాణ ప్ర‌జానికం హ‌ర్శించారు. కేసీఆర్ కు జై కొట్టారు. అది గ‌తం. ఆ త‌ర్వాత తెలంగాణ కు తొలి ముఖ్య‌మంత్రిగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఏంచేసారో వివ‌రించ‌కుండా ఉద్య‌మ‌నేత‌గా భావోద్వేగ‌పూరిత ప్ర‌సంగాలు మ‌ళ్లీ పున‌రావ్రుతం చేస్తూ ప్ర‌సంగించ‌డం దేనికి సంకేతం.? తెలంగాణ రాష్ట్రంతో రాజ‌కీయంగా త‌న‌కు ప‌ని లేద‌ని, తెలంగాణ ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించ‌డానికి కూడా చంద్ర‌బాబు నిరాక‌రించారు. అలాంటి చంద్ర‌బాబు ను దూషిస్తూ ఇంకా రాజ‌కీయ ల‌బ్ది పొందాలంటే అది ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌లీక్రుతం అవుతుంది.

 నాలుగున్న‌రేళ్లు గ‌డిచాక‌ తెలంగ‌ణ ద్రోహులు తెలంగాణ‌లో చ‌క్రం తిప్ప‌గ‌ల‌రా..?

నాలుగున్న‌రేళ్లు గ‌డిచాక‌ తెలంగ‌ణ ద్రోహులు తెలంగాణ‌లో చ‌క్రం తిప్ప‌గ‌ల‌రా..?

పైగా చంద్ర‌బాబు, చంద్ర‌శేఖ‌ర్ ఇంట్లో శుభ‌కార్యాల‌కు హాజ‌రైన‌ప్పుడు, చంద్ర‌బాబు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో క‌లిపేసుకున్న‌ప్పుడు ఆయ‌న ద్రోహిగా క‌న‌బ‌డ‌లేదా..? అప్పుడు బాబు రాజనీతిజ్ఞుడు.. ఇప్పుడు తెలంగాణ ద్రోహా..? తెలంగాణ ద్రోహులు, తెలంగాణ వ్య‌తిరేకులు తెలంగాణ సాదించుకునేంత వ‌ర‌కే..! రాజ్యాంగ బ‌ద్దంగా తెలంగాణ ఏర్ప‌డ్డాక, తెలంగాణ కు కేసీఆర్ తొలి ముఖ్య‌మంత్రిగా నాలుగున్న‌రేళ్లు ప‌ని చేసాక తెలంగ‌ణ ద్రోహులు తెలంగాణ‌లో చ‌క్రం తిప్ప‌గ‌ల‌రా..? తిప్ప గ‌లిగితే కేసీఆర్ స‌మ‌ర్థ‌త, సామ‌ర్థ్యం ఇంత‌కాలం ఏమైన‌ట్టు..? నింద‌ల‌కు గాని, ఆరోప‌ణ‌ల‌కు గాని హ‌ద్దుంటుంది..! కేవలం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఆశించి ఎదుటి వ్య‌క్తి ఆత్మ‌హ‌న‌నాకి పాల్స‌డ‌టం చంద్ర‌శేఖ‌ర్ రావు కు ఎంత‌వ‌ర‌కు సంమంజ‌స‌మో ఆయ‌నే చెప్పాలి.

ముంద‌స్తు గండం నుండి గ‌ట్టెక్కాలంటే మ‌ళ్లీ బూతు పురాణ అందుకోవాల్సిందేనా..?

ముంద‌స్తు గండం నుండి గ‌ట్టెక్కాలంటే మ‌ళ్లీ బూతు పురాణ అందుకోవాల్సిందేనా..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ జట్టు కట్టింది. అంతే కెసీఆర్ లో టెన్షన్ లో మొదలైనట్లు కన్పిస్తోంది. ఇప్పుడు కెసీఆర్ మూడో కన్ను తెరుస్తానని హెచ్చరిస్తున్నారు. ఇంత కాలం కెసీఆర్ ను మూడో కన్ను తెరవకుండా ఆపింది ఎవరు? బహిరంగ సభల్లో కూడా చంద్రబాబూ, నిన్ను బ్రహ్మాదేవుడు కూడా రక్షించలేడు అని వ్యాఖ్యానించి, తర్వాత ఆ కేసును పూర్తిగా మర్చిపోయింది కెసీఆర్ కాదా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలిస్తే తనకు రాజకీయంగా నష్టం వస్తుందనే ఆందోళనతోనే ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కెసీఆర్ విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గురువారం నాడు నల్లగొండ సభలో కెసీఆర్ స్పీచ్ తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తే బాగుండదనే తరహాలో హెచ్చరిక చేసినట్లు ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నయి.

తొలి ముఖ్య‌మంత్రిగా సాధించిందేంటి..? ఎందుకు ఆత్మ‌ర‌క్ష‌ణ వ్యాఖ్య‌లు..!!

తొలి ముఖ్య‌మంత్రిగా సాధించిందేంటి..? ఎందుకు ఆత్మ‌ర‌క్ష‌ణ వ్యాఖ్య‌లు..!!

అంటే ఈ కేసును కేవలం రాజకీయ అవసరాల కోసం వాడుకునేందుకు వీలుగానే ఇంత కాలం పక్కన పడేసి, ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారన్న విషయం తేటతెల్లం అవుతుంది. అసలు తెలంగాణలో టీడీపీనే లేదని వ్యాఖ్యానించిన కెసీఆర్, చంద్రబాబు ప్రచారం చేస్తే అంతగా భయపడాల్సిన పరిస్థితి ఉందా? నిన్న మొన్నటి వరకూ వంద సీట్లు గ్యారంటీ అంటూ ప్రకటించిన కెసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తాయని చెప్పటం ద్వారా తాను చెప్పే లెక్కల్లో నిజం ఎంతో ఆయనే బహిర్గతం చేశారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తెలంగాణ కు తొలి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఏం చేసారో చెప్ప‌కుండా ఇంకా ప‌క్క రాష్ట్ర వ్య‌క్తుల‌ను దూషిస్తూ స‌హ‌నం కోల్పోయి మాట్ల‌డ‌టం ఏంట‌ని తెలంగాణ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
KCR, who commented that there is no TDP in the original Telangana, should Chandra Babu campaign be afraid?KCR, who announced a hundred seats guarantee till yesterday, now claims that the TRS is the majority, revealing the fact that he is the most revealing of the truth. Telangana public thinking that scolding Chandrababu always is not correct.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X